
నీ ఇష్టం
– నీరజ వింజామరం
నీకు తెలిసి
నువ్వే తలదించుకొని
నిన్ను నువ్వే నిందించుకొని
నిన్ను నువ్వే బంధించుకుని
నీ పై బాణాలు సంధించుకుని
ఏమిటిలా రగిలిపోతావు ?
ఎందుకలా కుమిలి పోతావు?
నాకు తెలిసి
నువ్వే తల ఎత్తుకుని
కారే కన్నీటిని వత్తుకుని
పగిలిన గుండెను మెత్తుకుని
ఎక్కడికో ఎదిగి పోతావు
అయినా వినయంతో ఒదిగిపోతావు
ఎంపిక నీకే వదిలేస్తున్నాను
నీ నువ్వు లా చితికి “చితికి “పోతావో
నా నువ్వు లా అతికి బతికి పోతావో
నీ ఇష్టం
*****
Please follow and like us:

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .
