అమ్మ ఆవేదన!

-దయాకర్ రావుల

 

మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా!
వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా!

వాళ్ళతో సంతోషంగా ఉన్నా!
కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా!

ఏం అయ్యిందో ఏమో గానీ

మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది!
రోజు రోజుకి చిన్నది అయ్యింది!

నేను తప్ప ఎవరూ పట్టలేనంత!
ఇంకో మనిషికి చోటు లేనంత!!

నాపై నాకు ధ్యాస తప్పింది!
శ్వాస ఇబ్బంది అయ్యింది!

చుట్టూ నిర్మాన్యుషం!
భరించలేనంత నిశ్శబ్దం!

అయినా

వలయం నుండి బయటకి రాలేకపోతున్నా!
హృదయంలోని బాధ ఎవరికీ చెప్పలేకపోతున్నా!
ఒంటరి పక్షినై క్రుంగిపోతున్నా!
విహంగాలు తెగి విలవిలలాడుతున్నా!

నాకు నేను వేసుకున్న సంకెళ్లతో
అంతులేని ఆవేదనతో
వలయంలోనే ఆవిరవుతున్నా!
వలయం నుండి నిష్క్రమిస్తున్నా!!

*****

Please follow and like us:

One thought on “అమ్మ ఆవేదన! (కవిత)”

  1. సమాజాన్నుంచి దూరమైన మనిషి తనకంటూ ఒక పరిధిని గీసుకుంటున్నాడు. నా అనుకున్న వాళ్ళు ఒక్కరొక్కరే దూరమయ్యాక బ్రతుకు భారమనిపిస్తుంది..”నాపై నాకు ధ్యాస తప్పింది.. శ్వాస ఇబ్బంది అయింది” అన్న వాక్యాలలో ఒంటరితనపు భారాన్ని కవి చక్కగా అక్షరీకరించారు. మొత్తంమీద చక్కని భావమున్న కవిత. ఇంత మంచి కవితను అందించిన దయాకర్ గారికి అభినందనలు…

Leave a Reply

Your email address will not be published.