
నీలినీలి అలల ముంబయి
-డా.కందేపి రాణి ప్రసాద్
2024వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ముంబయి లోని నెహ్రూ సైన్స్ ఆడిటోరియంలో ఎన్ఎన్ఎఫ్ వారి కాన్ఫరెన్స్ జరగుతున్నది. ఇవన్నీ పిల్లల డాక్టర్లకు సంబంధించిన సమావేశాలు. రాత్రి 8:15 కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ముంబయి వెళ్ళాం. ఫైవ్ స్టార్ హెూటల్ ఆర్కిడ్ లోని రూం నెంబర్ 477లో దిగాము. ఈ హెూటల్ మధ్యలో ఆరు ఫ్లోర్ల పై నుంచి నీళ్ళు గుండ్రంగా తిరుగుతూ పడుతున్నాయి. బావుంది ఇది చూడగానే హాంకాంగ్ దేశంలోని వెనేషియన్ లో ఇలాగే నీళ్ళు రంగుల్లో కిందికి దూకుతూ మధ్యలో పేర్లు కూడా రావడం గుర్తొచ్చింది. ఇక్కడ అంత అందంగా లేదు కానీ బావున్నది. హెూటల్ రూమ్ రెండుగా విడిపోయి మధ్యలో టీవీ పెట్టారు. ఏ రూమ్ లో కూర్చున్నా టీవీ చూడొచ్చు. ఫ్యాన్లు, లైట్లు, ఏసీ అన్ని స్విచ్ లూ ఒకే ఎలక్ట్రానిక్ బోర్డుపై ఉన్నాయి. మంచం పై పడుకొనే టేబుల్ మీద ఉన్న స్విచ్ బోర్డుతో అన్ని స్విచ్ లనూ ఆపరేట్ చేయవచ్చు. ఇది బావుంది. మొదటిసారిగా మేము ‘పెడికాన్’ కోసం ముంబయి వెళ్ళినపుడు ‘జుహు’లోని ‘సన్ అండ్ శాండ్’ హెూటల్లో దిగాము. రెండవసారి కాన్ఫరెన్స్ కు వెళ్ళినపుడు ‘పార్క్ ప్లాజా’లో దిగాము. ‘సన్ అండ్ శాండ్’ లో ఉన్నపుడు హిందీ సినిమా హీరోలు కనిపిం చారు. హెూటల్ ఆర్కిడ్ కు బయట చాలా చెట్లు ఉన్నాయి గ్రౌండుంది. ఫొటోలు తీసుకోవాలి అనుకున్నాను. ఇందులో ‘boulivard coffee shop’ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది. ఆ కాఫీ షాప్ లో తినేసి పడుకున్నాము.
నెహ్రూ సైన్స్ ఆడిటోరియమ్ వర్లిలో ఉన్నది. ఇక్కడికి వెళ్తుంటే ‘రాజీవ్ సీలింక్ బ్రిడ్జ్’ వచ్చింది. ఈ బ్రిడ్జిని చూస్తుంటే కలకత్తాలోని ‘హౌరాబ్రిడ్జి’ గుర్తొచ్చింది. బ్రిడ్జి దిగాక ఎడమ వైపు ‘సౌత్ ముంబయి’ అనే బోర్డుంది. బ్రిడ్జి వద్ద సముద్రం నీళ్ళు, వాటి వెనకాల పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తే సింగపూర్ ను గుర్తుకు తెచ్చింది. నెహ్రూ సైన్స్ ఆడిటోరియమ్ కు చేరే సరికి లోపల చాలా మంది పిల్లలు కనిపించారు. ఆడిటోరి యమ్ ను పిక్ నిక్ లా చూడటానికి వచ్చారు. వాళ్ళను చూస్తూ మేము లోపలికెళ్ళి పోయాము.
‘నెహ్రూ సైన్స్ సెంటర్’ 1977లో ‘లైట్ అండ్ సైట్’ ఎగ్జిబిషన్లో మొదలైంది. 1979 లో దీనిలో సైన్స్ పార్కును కట్టారు. 1985వ సంవత్సరం నవంబరు 11వ తేదీన దీనిని అప్పటి ప్రధాన మంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ దీనిని ప్రారంభించారు. భారతదేశంలోనే ఇది చాలా పెద్దది. ఇది ఎనిమిది ఎకరాలలో వ్యాపించి ఉంది. ఇందు లోని సైన్స్ పార్కులో రకరకాల మొక్కలు, వృక్షాలు, పొదలు ఉన్నాయి. అంతేకాక ఎనర్జీ, సౌండ్, కైనమాటిక్స్, మెకానిక్స్, ట్రాన్స్ పోర్టు మొదలైన రంగాలలో సైన్స్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. భారతదేశమంతటా 25 సెంటర్లు ఇలాంటివి ఉన్నాయి. నెహ్రూ సైన్స్ సెంటర్లు మంచి బిల్డింగులతో, తగిన స్టాఫ్ చదువుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ సైన్స్ ను వ్యాపింప చేస్తున్నాయి. విద్యార్థులకు, సైన్స్ పట్ల అభిరుచి ఉన్న సాధారణ ప్రజలకూ ఇలాంటి సెంటర్లు చాలా అవగాహనను కల్పిస్తు న్నాయి. ప్రతి సంవత్సరం ఈ సెంటర్ ను దాదాపు ఏడు లక్షలమంది సందర్శిస్తా రట. ఈ సైన్స్ సెంటర్లకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్ మాతృసంస్థ.
ప్రసిద్ధిమైన సిద్ధి వినాయక ఆలయానికి వెళ్ళి వచ్చాం. గోరేగావ్ లో ఉన్న ఇనార్టిట్ మాల్ కు వెళ్ళాము. బావుంది. మాహిమ్, మాతుంగా, వర్లి, కలీనా, బాంద్రా. దాదర్, అంధేరీ ప్రాంతాలన్నీ చూశాం. మేమున్న ఆర్కిడ్ హెూటల్ అంధేరీ ఈస్ట్ లో, ఎయిర్ పోర్టుకు ఎదురుగా ఉన్నది. అంధేరీ వెస్ట్ లో అమితాబ్ బచ్చన్ ఇల్లట చూపించారు. దాని ముందు నిలబడి ఫొటో తీసుకున్నాము. దాదర్లో కొన్ని బట్టలు కొనుక్కున్నాం. నెహ్రూ సెంటర్ ఆదివారాలు కూడా తెరిచే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. సంవత్స రం మొత్తంలో కేవలం రెండు రోజులు మాత్రమే శెలవు ఉంటుంది. హెూలీ పండుగ, దీపావళి పండుగ తరువాతి రోజులు శలవు. పండుగ రోజు తెరిచే ఉంటుంది.
దాదర్ ఈస్ట్ లో ముంబయి ఆంధ్రమహాసభ ఉన్నది. ఇది 1928 నుంచి విద్య, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం కీ.శే మండలి వెంకట కృష్ణారావు గారి పేరు మీద అవార్డును సాహిత్య కారులకు ప్రదానం చేస్తారు. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఉన్న లైబ్రరీని. వారు చేస్తున్న సేవల గురించీ తెలుసుకున్నాం. మేము మొదటిసారిగా 2003లో ఆంధ్ర మహాసభకు వెళ్ళినపుడు మా కోసం ఒక మీటింగ్ను ఏర్పాటు చేసి అందర్ని పరిచయం చేశారు. అప్పుడు నేను తయారు చేసిన సైన్స్ ఛార్టులను అక్కడ ప్రదర్శించాము. ఆంధ్ర మహాసభ సభ్యులు, అధ్యక్ష, కార్యదర్శులు అందరూ చాలా సంతోషంగా స్వాగతిం చారు. ఇప్పుడు వెళ్ళగానే ఆ విషయాలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. ఈ సారి కూడా మేము వెళ్ళినపుడు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ ద్వారా, రచనల ద్వారా సాహిత్యాన్ని పిల్లల దగ్గరకు చేరుస్తున్నందుకు ఆత్మీయంగా సత్కరించారు. వారి ప్రేమ పూర్వక పలకరింపులు, సత్కారంతో మేము చాలా సంతోషించాం.
కాన్ఫరెన్స్ చివరి రోజు సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ ఇండిగో 6ఇ268. ఎదురు గానే ఎయిర్పోర్టు కదా అని మెల్లగా బయల్దేరాం. విండో సీటు వచ్చింది. బయట నున్న ఎండకు కిందనున్న మబ్బులు పరుపులాగా, పైనున్న ఆకాశం నీలంగా చక్కగా గీత కొట్టినట్టుగా విడగొట్టబడుతూ ముచ్చటైన కలర్ కాంబినేషన్ లో కనిపిస్తున్నది. వాటిని చూస్తే వాయు రూపంలో ఉన్న మబ్బుల్లా అసలు అన్పించడం లేదు. సముద్ర జలాల పై పేరుకున్న మంచు వలె కనిపిస్తున్నవి. ముంబై మహానగరం మొత్తం ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలా కనిపిస్తున్నది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.