చిత్రం-67

-గణేశ్వరరావు

 
          మోలీ క్రేబ్ఏపిల్ – కోపం నిండిన. చిత్ర కారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్ర కారుల్లా తను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీస్తూ వాల్ స్ట్రీట్ ఆక్రమణ.. వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్యగీతం గా మారింది – పోరాటవీరులను, శరణార్ధులను, పోలీసుల బాధితులను నల్లని రేఖా చిత్రాలుగా తన శైలిలో చూపించింది. ఎన్నో వాల్యూమ్ లు ఇప్పటికే వచ్చాయి, ‘రక్త స్రావం’ ఆమె వ్యక్తిగత ఆల్బమ్,
 
          కళాకారిణిగా ఆమె రూపొందడం విచిత్రంగా జరిగింది: తన 17వ ఏట తన ఫొటోలను తగల పెట్టిన మర్నాడే యూరప్ కి వెళ్తూ తన పేరు మార్చుకుంది, క్రేబ్ ఆపిల్ అన్నది ఆమెకు తలి దండ్రులు పెట్టిన పేరు కాదు. తన బొమ్మలు అమ్ముడు కాక పోవడంతో, న్యూయార్క్ లో పాతికేళ్ళ క్రితమే తనని తనే ఆమ్ముకోవడం మొదలు పెట్టింది, న్యూ యార్క్ నైట్ క్లబ్ లో నగ్నంగా డాన్స్ చేసింది. సమాజాన్ని అలా చూసాక ఆమెలో చిత్రకారిణిగా మార్పు వచ్చింది, చీకటి మూలాలలోకి తొంగి చూస్తూ బాధితుల కోసం బొమ్మలు గీయ సాగింది. ఆమె వేసిన కొన్ని నగ్న చిత్రాలు కొందరికి నచ్చక పోవచ్చు. కాని అందరూ ఆమె ప్రతిభను మెచ్చు కోకుండా ఉండలేరు, ఆమెకున్న ‘కెమెరా కన్ను’ని గుర్తించకుండా ఉండడం అసాధ్యం. ‘ఫోటో జర్నలిజంలా ఆర్ట్ లో కూడా సారాన్ని ఒడిసి పట్టు కోవచ్చు, కాగా ఆమె చిత్ర కళ ఆత్మాశ్రయ ధోరణిని అనుసరిస్తుంది, కళాకారుడి స్వేచ్ఛను కాదన లేము, తను నమ్మిన నిజాలని తన చిత్రాలు వ్యక్తీకరిస్థాయి’ అని అంటారామె.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.