అనుసృజన

హసరత్ జైపురి ప్రేమ గీతం

మూలం : హసరత్ జైపురీ

అనుసృజన: ఆర్ శాంతసుందరి

జబ్ ప్యార్ నహీ( హై తో భులా క్యో( నహీ( దేతే
ఖత్ కిస్ లియే రక్ఖే హై( జలా క్యో( నహీ( దేతే
కిస్ వాస్తే లిక్ఖా హై హథేలీ పే మేరా నామ్
మై హర్ఫ్-ఏ-గలత్ హూ( తో మిటా క్యో( నహీ( దేతే
లిల్లాహ్ శబ్-ఓ-రోజ్ కీ ఉలఝన్ సే నికాలో
తుమ్ మేరే నహీ( హో తో బతా క్యో( నహీ( దేతే
రహ్ రహ కే న తడపావో ఏ బేదర్ద్ మసీహా
హాఠోంసే ముఝే జహర్ పిలా క్యో( నహీ( దేతే
 
***
ప్రేమ లేకపోయిన తరవాత మర్చిపోవచ్చు కదా
ఉత్తరాలు దాచిపెట్టావు , కాల్చి పారెయ్యచ్చు కదా
అరచేతిలో ఎందుకు రాసుకున్నావు నా పేరు
నేను అచ్చు తప్పునయితే తుడిపెయ్యచ్చు కదా
దేవుడా! రాత్రింబవళ్ళు అనుభవిస్తున్న ఈ సందిగ్ధం నుంచి విముక్తి ప్రసాదించు
నువ్వు నా మనిషివి కానప్పుడు అలాగని చెప్పచ్చు కదా
ఉండుండి ఇలా నన్ను నిర్దయగా వేధించే బదులు
నీ చేతులతోనే ఇంత విషం ఇచ్చెయ్యచ్చు కదా
అతని ప్రేమ మీద నీకు నమ్మకం లేనట్టయితే
‘హసరత్’ ని నీ చూపుల్లోంచి తొలగించి వేయచ్చు కదా
 
***
(శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినీ గీతాల రచయిత హసరత్ జైపురీ – రొమాంటిక్ గీత రచయితగా పేరు సంపాదించుకున్నాడు. సినీ గీతాలే కాకుండా మంచి కవిగా కూడా గుర్తింపబడిన సున్నిత హృదయుడు హసరత్.)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.