ఆ కాగితం నా సహచరుడు

– సాయి కిషోర్ గిద్దలూరు

సుగంధద్రవ్యాలు నాలోనే
నేను దాచుకున్నాను
అవి కనిపించవు,
నా హృదయాలలో దాగున్నాయి.

కనివిని ఎరుగని
చోటు లేని అంతరంగంలో
నేను ఒంటరివాడినైనప్పుడు
నాలో ఆ ప్రశాంతత, సంతోషపు హాయిగా, ఆలోచనాత్మకంగా
నా సిరాతో ఆ కాగితం పై
నాలుగు వాక్యాలు రాస్తే
ఎంతో ఆనందాన్ని ఇస్తుంది,
అందుకే నాలో నేను
ఆ కాగితంగా
ఒంటరినై తపిస్తూ,
ప్రవహిస్తూ ఎప్పటికీ
ఎన్నటికైనా నేను ఒంటరివాడినే
కానీ నాతో ఆ కాగితం ఉన్నంతవరకు
నేను ఒంటరివాడిని కాను..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.