
చిత్రం-69
-గణేశ్వరరావు
ఆఫ్రోడైట్ గ్రీకు పౌరాణిక ప్రేమ దేవత, రోమన్లు ఈమెను వీనస్ పేరుతో పిలుస్తారు. మనకూ ఉన్నారు శృంగార దేవతలు మన్మధుడు, రతీదేవి! పౌరాణిక ఇతివృత్తాలను తీసుకొని ఆధునికంగా వాళ్ళ రూపాలను చిత్రించిన వారిలో ముఖ్యడు 19 వ శతాబ్దపు అడాల్ఫ్ విలియం బూగేరో. వీనస్ దేవతను ఆయన ఇలా చిత్రించాడని అంటారు, అయితే నేను పోస్ట్ చేసిన చిత్రం ఆయన చిత్రానికి డిజిటల్ రూపం. చిత్రంలో గొప్పతనం వివరించడం అసాధ్యం. మాటల్లో చెప్పలేని ఆకర్షణ ఏదో వుంది చిత్రంలో.. బహుశా digital చిత్రం కావడం ఒక కారణమేమో! ‘బాహుబలి’ లో తమన్నాను ఒక దేవకన్యగా చూపించ లేదూ!
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
