కాదేదీ కథకనర్హం-20

తిరిగిరాని గతం – 3

-డి.కామేశ్వరి 

నిజం చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వచ్చేవరకు అసలు మహిమ పెళ్ళి గురించే ఆలోచించలేదు. ఒంటరితనం విసుగనిపించలేదు. ఐదారేళ్ళు చదువయ్యాక కొత్త ఉద్యోగం, కొలీగ్స్ తో సరదాగా గడపడం, స్టూడెంట్స్ తో చనువుగా వుంటూ, కొందరు స్టూడెంట్స్ ఇంటికి వచ్చి చదువు చెప్పించుకుంటూ…..ఫ్రెండ్స్ తో పిక్నిక్లు పార్టీలు అంటూ లైఫ్ ఎంజాయ్ చేసింది. పుస్తకాలు చదవడం, టి.విచూస్తుంటే రాత్రి గడిచి పోయేది. శలవుల్లో ఇంటికెడితే అన్నయ్యలు, పిల్లలతో రోజులు నిముషాల్లా గడిచేవి.

మహిమకి తల్లిపోయే నాటికి ముప్పై నిండింది. ఆఖరి కోరిక తీరలేదన్న వ్యధతోనే పోయింది ఆవిడ.

ముప్పై ఏళ్ళు నిండి జీవితం రొటీన్గ మారిపోయాక మహిమకి ఆ జీవితం పట్ల కాస్త అనాసక్తత, విసుగు, మొదలైంది. రోజూ అవే పాఠాలు, అదే యూనివర్శీటీ, అదే కొలీగ్స్ ముఖాలు, ఉదయం లేచిందగ్గిర నుంచి ప్రతిదీ ఏదో రొటీన్గా తయారైంది అన్పించడం మొదలుపెట్టింది. జీవితంలో ఏదో కావాలని, మార్పు కోరసాగింది ఆమె మనసు. అందరూ తన కళ్ళ ముందే మొగుడు పిల్లలతో సంసారాల్లో పడిపోతే తనోక్కర్తే ఇలా ఒంటరిగా మిగిలిపోయిందనిపించసాగింది. కనిపించిన మంచి చీరల్లా కొని వార్డ్రోబ్ నింపేసే మహిమకి…..ఈ చీరలు ఎవరికోసం కట్టుకోడం…..ఇంట్లో ఈ ఫర్నిచర్ ఈ మార్పులు చేర్పులు ఎవరూ చూడాలని….ఈ డబ్బు సంపాదించి ఎవరికి పెట్టాలి లాంటి ప్రశ్నలు తలెత్తడం ఆరంభించాయి. చీరాల మీద, ఈ అలంకరణ మీద, పార్టీల మీద శ్రద్ధ తగ్గి అదోలా మూడీగా వుండసాగింది. చాలింక ఈజీవితం……కొత్తరకం జీవితం మొదలు పెట్టాలి అనిపించింది. తనని ఇప్పుడెవరన్నా పెళ్ళి చేసుకో అంటే బాగుండును….. ఏదన్నా సంబంధం చూస్తె చేసుకో అని బలవంతం చేస్తే…..ఆ సమయంలో హటాత్తుగా తల్లి, తండ్రి తన పెళ్ళి గురించి ఎలా పలవరించారో గుర్తు వచ్చేది. అన్నయ్యలిద్దరూ బొత్తిగా తన గురించి పట్టించుకోడం మానేశారు. తల్లి వుండగా శలవులకి వెళ్ళేది. ఇప్పుడ సలు “రా” అని కూడా ఎవరూ అనడంలేదు. తనంతట తాను నేను పెళ్ళి చేసుకుంటాను సంబంధాలు చూడండి అని ఎలా చెప్పడం ఎవరికి చెప్పడం అనిపించేది –

ఇప్పటివరకూ ఏ పురుషుడు ఆమెని ఎట్రాక్ట్ చెయ్యలేదు. యూనివర్శీటీలో కొలీగ్స్ అంతా పెళ్ళయిన వాళ్ళు…..ముసలి భావాలి, సంసార జంజాటాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా, చలాగ్గా వుండే మగవాడే ఆమెకి పరిచయం కాలేదు. అలా అనేకంటే ఆమె పరిచయం చేసుకోలేదు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్ళి కానిదని కాస్త చొరవ తీసుకోడానికి ప్రయత్నించి, ఆకర్షించాలని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగానే వుంచేది. జీవితం అంటే యూనివర్శీటీ, పాఠాలు మాత్రమే కాదు ఇంకేదో కావాలి – అనిపించే వేళకి ముప్పై నాలుగు నిండాయి.

ఆ టైములో ఓసారి వల్లి పుట్టింటికి వచ్చింది. ఇద్దరు టీనేజ్ పిల్లలతో పక్కా యిల్లాలు అయిపొయింది. అక్కడికి మహిమ వెళ్ళే సరికి వల్లి పినమామగారి కొడుకు నరేష్ అంటే మహిమ కోసం చూసిన అతను భార్యతో సహా – ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయింది వల్లి పరిచయం చేస్తుంటే, ఇతన్నా తను వద్దంది…..ఎంత స్మార్ట్గా, ఎంత హుందాగా వున్నాడు. అతని భార్య అయితే ఎంత బాగుంది….ఇద్దరినీ చూస్తె, వాళ్ళ జోక్స్ మాటలు వింటుంటే “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటే యిదేనేమో అనిపిం చింది. పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా వున్నారు. ఆ ముచ్చటైన దంపతులని, సంసారాన్ని చూస్తె —— తనది కావాల్సిన దాన్ని చేతులారా వదులుకుంది అన్న భావం ముల్లులా మనసుని తాకింది. పెళ్ళి అంటే నరకంలోకి అడుగుపెట్టడం మాత్రమే కాదు – అదృష్టం బాగుంటే స్వర్గంలానూ వుండొచ్చు అనిపించింది. ఒకసారి అతన్ని తను చూసి వుంటే ఎంత బాగుండేది — పెళ్ళిచూపులు వద్దని ఎంత పొరపాటు చేసింది. ఆమె మొహంలో హావభావాలు కనిపెట్టిన వల్లి స్నేహితురాలి వంక “చూసావా నీవేం పొందలేక పోయావో” అన్నట్టు చూసింది.

ఇద్దరు స్నేహితురాళ్ళు డాబా మీద కూర్చుండగా — “ఏం ఇప్పటికన్నా పెళ్ళి కావాలనిపిస్తుందా లేదా…’ అడిగింది వల్లి. తల ఆడించింది. అది వద్దనో, కావాలనో మహిమకే తెలియదు. స్నేహితురాలిని చూసి నిట్టూర్చింది వల్లి- అందంగా వుండే మిసమిసలాడే ఆ రంగు వన్నె తగ్గడం ఆరంభించింది. మొహంలో ఆ కళ, నునుపు తగ్గిపోయాయి. కళ్ళకింద నల్ల చారలు వచ్చాయి. మొహంలో “గ్లో” పోయింది. “లైఫ్ బోర్ కొట్టడంలేదు….. ఒక్కర్తివి ఒంటరితనం ఫీలవడంలేదూ…..’ మహిమ తలదించుకుంది. గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు గుటక వేసింది. “చేసుకో మహీ —-బిఫోర్ యిట్ ఈజ్ టూ లేట్…..జీవితంలో ప్రతి మనిషికి మార్పుండాలి…..ప్రతి దశలో మనిషికి మార్పు లేకపోతే పిచ్చేత్తుతుంది. పసితనంలో ఆటపాటలు, చిన్నప్పుడు చదువు సంధ్యలు – యవ్వనం లో పెళ్ళి, ఆ తరువాత పిల్లలు, సంసారం….ఇంకా పెద్దయ్యాక మనవలు…..ఇలా ప్రతి స్టేజిలో జీవితంలో కొంత అనుభవాలు, అనుభూతులు కావాలి మనిషికి. ప్రతి స్టేజిలో మనిషికి ఓ తోడుండాలి. మనసులోని మాట చెప్పేందుకు నా అనే మనిషి వుండాలి. జీవితం నడిచే రైలు బండిలా వుంటేనే, ఓ గమ్యం చేరాలన్న ఆరాటంతో, ప్రయాణం లోని అన్ని ఇబ్బందులు సహించగలడు మనిషి – ఎంత రద్దీ, చమట, చీదరవున్నా రైలు కదులుతున్నంత సేపు మనిషి సర్దుకుపోతాడు – అదే రైలు ఆగిపోతే ఎంత అసహజంగా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకు. రైలు కదలాలి. నీవెంత ఏ.సి. క్లాసులో కూర్చున్నా రైలు కదలకపోతే ఆ ఏ.సి చల్లదనం, నీకు తృప్తి నివ్వలేదు. కదలని రైలులో ఎన్ని రోజులు మార్పు లేకుండా కూచోగలవు. నీకు డబ్బుంది, చదువుంది, బంగాళా, కార్లు, చీరలుమ నగలు అన్నీ వున్నాయి. కాని నీ జీవితానికి పరిపూర్ణత వుందనిపిస్తుందా – ఏదో లోటు కన్పించడంలేదూ. మహిమా…..ఇప్పటికయినా తొందరగా ఎవరినన్నా చేసుకో….. అన్నింటికన్నా మనిషికి శాపం ఏమిటో తెలుసా? ఒంటరితనం….అది నీవు ఇప్పటికన్నా గ్రహించలేదూ….”

“నన్నెవరు చేసుకుంటారు ఇప్పుడు…..’ వినిపించీ వినిపించనట్లుంది.

“ఇన్నేళ్ళల్లో నీకు నచ్చిన మగాడే కన్పించలేదా…..ఫరవాలేదు. ఈ వయసుకి సరిపోయిన వాళ్ళుంటారు. పోనీ పేపర్లో వేయి…..వల్లి ” సలహా.

ఇంటికి వెళ్ళాక ఎందుకో ఏదో దిగులు, గుండెల్ని మెలిపెట్టినట్లు ఇబ్బంది….. మహిమకి ఎందుకో అకారణంగా కళ్ళనీళ్ళు వచ్చాయి.

ఇప్పుడు మహిమకి నలభై మూడు నిండాయి. మహిమ పెళ్ళి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. పేపర్లలో రెండు మూడు సార్లు అడ్వర్టైజ్ చేసింది. చాలానే వచ్చాయి. జవాబులు చాలావరకు రెండో పెళ్లి వాళ్ళు, డైవోర్సులు కొంతమంది చదువు, సంపాదన తనతో ఎందులోనూ తూగనివారు అందులో కాస్త నచ్చినవి రెండు, మూడు, ముగ్గురిని పిలిచింది ఇంటర్వ్యూకి. ఒకతను ఎండిపోయి కట్టే పేడులా వుండి, వున్న అరగంటలో ఆరు సిగరెట్లు కాల్చాడు. ఇంకోడు బట్టతల, బాన పొట్ట – కళ్ళెర్రగా తాగినవాడిలా…..వున్న ఐదు నిమిషాల సేపు మహిమని చూపులతో తినేసాడు- మహిమకి అందరినీ చూస్తే కంపరం ఎత్తింది. ఇన్నాళ్ళు ఉండి ఇలాంటి వాళ్లానా చేసుకునేది. పిల్లలున్న వాళ్ళని, డైవర్స్లని అసలు పిలవలేదు. ఏభై ఏళ్ళ వాళ్ళు కాకపోతే పాతికేళ్ళ బాలాకుమారులు ఎవరోస్తారు తనకు, ఇప్పుడు విరక్తిగా వేదనగా అనుకుంది. పెళ్ళి ప్రయత్నాలు ఆవిధంగా బెడిసి కొట్టాక మళ్ళీ ఏ ప్రయత్నమూ చేయలేదు మహిమ.

నలభై ఐదేళ్ళ మహిమ జుట్టు తెల్లబడుతోంది. కళ్ళజోడు వచ్చింది. వళ్ళు వస్తుంది. అచ్చం ప్రొఫెసరమ్మలా కనిపిస్తుంది ఇప్పుడు.

ఇంట్లో కాలక్షేపానికి అన్న కూతురిని యూనివర్శీటీలో తన దగ్గిర చదివిస్తానని తెచ్చి పెట్టుకుంది పల్లవిని. అప్పటినుంచి కాస్త యింట్లో కాలక్షేపం ఆవుతోంది. అన్నగారు పెళ్ళి పెటాకులు వద్దన్న మహిమ దగ్గర కూతురిని ఉంచడానికి చాలా సందేహించాడు. వున్న చోట సీటు దొరక్క ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు.

ఆ రోజు అన్నగారు ఆ వూర్లో పల్లవికి ఏదో మంచి సంబంధం వుందంటే మాట్లాడడా నికి వచ్చాడు. “ఇప్పుడా, నా పరీక్షలు అయితే గాని నేనేం చేసుకోను. ఇప్పుడెం సంబంధా లు చూడద్దు. చూసి నన్ను ప్రాణం తీయకండి. ముందే చెపుతున్నాను….’ అంది పల్లవి.

అన్నగారు ఏదో అనేలోపలె “పరీక్షకేంలే….అవే అవుతాయి. పెళ్ళి చేసుకుంటే ఎగ్జామ్స్ రాయకూడదనేం వుందా…..ఫోటోలో అబ్బాయి బాగున్నాడు మంచి ఉద్యోగం ఆయన ఇప్పటికీ అని బలవంతం చేసుకు పెళ్ళిచూపులకి ఒప్పించడం అనిపించేది –

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.