
అనుసృజన
మీరా పదావళి (తరువాయి గీతాలు)
అనువాదం: ఆర్.శాంతసుందరి
13. కో బిరహినీ కో దుఖ్ జాణే హోమీరా కే పతి ఆప్ రమైయాదూజో నహీ కోయీ ఛాణే హో(ఒక విరహిణి అనుభవించే దుఃఖం ఎవరికి అర్థమౌతుంది?మీరాపతి ఒక్క ఆ గిరిధరుడే తప్ప ఆమెకి ఇంకే ఆధారమూ లేదు)రోగీ అంతర్ బైద్ బసత్ హైబైద్ హీ ఔఖద్ జాణే హోసబ్ జగ్ కూడో కంటక్ దునియాదర్ద్ న కోయీ పిఛాణే హో(రోగి మనసులో ఉండేది ఆ వైద్యుడేఆయనకే ఏ ఔషధమివ్వాలో తెలుసుఈ లోకం వృథా, ముళ్ళతో నిండిన ప్రపంచమిదిఇక్కడ ఎదుటివారి బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు)జా ఘట్ బిరహా సోయీ నకీహైకయీ కోయీ హరిజణ మానయీ హోబిరహ్ దరద్ ఉరీ అంతర్ మా హీహరి బిన్ సబ్ సుఖ్ కాణే హో( విరహంతో వేగిపోయే శరీరం దుర్బలమైపోతుందిచాలామంది హరి భక్తులు నమ్మే విషయం అదివిరహవేదన హృదయంలో నుంచి ఎగసిపడుతోందిహరి లేకుండా ఎన్ని సుఖాలున్నా అన్నీ వ్యర్థమే) హోయ్ ఉదాసీ బన్ బన్ ఫిరూరే బిథా తన్ ఛాయీదాసీ మీరా లాల్ గిరిధర్మిల్యా హై సుఖదాయీ( దిగులుతో అడవులవెంట తిరుగుతున్నానువ్యథ నన్ను పూర్తిగా ఆవహించిందిదాసీ మీరాకి ప్రియమైన తన గిరిధరుడుదొరికితే కాని సుఖమనేది ఉండదు) *** 14. మాయీ మాయీ ఓ మాయీ మాయీకైసే జియూం రీహరి బిన్ కైసే కైసే జియూంరీ(అమ్మా, ఓ అమ్మాఎలా బతకనుహరి లేక ఎలా, ఎలా బతికుండేది?)ఉదక్ దాదుర్ పినావత్ హైజల్ సే హీ ఉపజాయీపల్ ఏక్ జల్ కో మీన్ బిసరేతరపత్ మర్ జాయీ(కప్పలు నీరు తాగి బతుకుతాయిఅవి నీటిలోనే జన్మిస్తాయికానీ చేపలు ఒక్క క్షణం నీరు లేకపోతేగిలగిలా కొట్టుకుని చనిపోతాయి)పియా బిన్ పీలీ భయీ రేజ్యో కాఠ్ ఘున్ ఖాయీఔషధ్ పూరణ్ సంచరై రేబాలా బైద్ ఫిరి జాయీ(నా ప్రియుడు దగ్గర లేకపోవటం వల్ల కలిగిన వేదనతోచెక్కలకి పట్టిన చీడలా నేను పాలిపోయానుఔషధం పూర్తిగా ప్రయోగించినాఫలితం లేకపోవటంతో వైద్యులు వెళ్ళిపోతున్నారు)హోయ్ ఉదాసీ బన్ బన్ ఫిరూరే బిథా తన్ ఛాయీదాసీ మీరా లాల్ గిరిధర్మిల్యా హై సుఖదాయీ( దిగులుతో అడవులవెంట తిరుగుతున్నానువ్యథ నన్ను పూర్తిగా ఆవహించిందిదాసీ మీరాకి ప్రియమైన తన గిరిధరుడుదొరికితే కాని సుఖమనేది ఉండదు)
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
