image_print

మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష)

మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష) -సి.బి.రావు కొన్ని పుస్తకాలను మనం చదువుతాం. మరికొన్ని మనల్ని చదివిస్తాయి. ఈ రెండవ కోవలోకి చెందే  పుస్తకాలలో జయతి లోహితాక్షన్ వ్రాసిన మనం కలుసుకున్న సమయాలు వుంటుంది. ఎవరీ జయతి లోహితాక్షన్? పూర్వాశ్రమంలో ఒక పాఠశాల అధ్యాపకురాలు. నేడు ఒక ప్రకృతి ప్రేమికురాలు, సంచార జీవి. స్వస్థలం: బోధన్ (నిజామాబాద్ జిల్లా), లోహితాక్షన్ (అధ్యాపకుడు) తో వివాహం. ఈ పుస్తకానికి ముందే జయతి వ్రాసిన రెండు […]

Continue Reading
Posted On :

#మీటూ (కథలు)-2

#మీటూ -2 సంపాదకురాలు: కుప్పిలి పద్మ పుస్తక పరిచయం: సి.బి.రావు స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం మొదలయింది. కుప్పిలి పద్మ కథలోని నిఖిత తరగతిలో మొదటి స్థానంలో వుండేందుకు, ప్రొఫెసర్ కు దగ్గరవుతుంది. చాల సంవత్సరాల తర్వాత, మిటూ అంటూ ఒక పోస్ట్ పెడుతుంది. నేటి స్త్రీలు హింసలే కాకుండా,  ప్రలోభాలకూ […]

Continue Reading
Posted On :

#మీటూ (కథలు)

#మీటూ -(కథలు) మిట్టమధ్యాన్నపు నీడ (కథ)   -సి.బి.రావు  ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం, తన బలం, బలహీనతా అంటారు. మహి ‘మ్యూజింగ్స్’ బ్లాగ్, సారంగా, B.B.C. Telugu, నమస్తే, వగైరా websites ల లో పెక్కు వ్యాసాలు వ్రాసారు. […]

Continue Reading
Posted On :

నా లండన్ యాత్ర : డా. కేతవరపు రాజ్యశ్రీ

నా లండన్ యాత్ర: డా|| కేతవరపు రాజ్యశ్రీ -సి.బి.రావు  డా. కేతవరపు రాజ్యశ్రీ , కవి, రచయిత్రి, వక్త, సామాజిక సేవిక, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. కవిత్వంలో అన్ని ప్రక్రియలలో కవితలు వెలువరించారు. “వ్యంజకాలు”  అనే ప్రక్రియలో 108 వ్యంజకాలు వ్రాసి “బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించారు. “ఊహల వసంతం” కవితా సంపుటిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2010 లో ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ టాగూర్  స్ట్రే బర్డ్స్ ను “వెన్నెల పక్షులు” గా అనుసృజన గావించారు. నిత్యజీవనం లోని […]

Continue Reading
Posted On :

తూర్పుగాలి: డా.భార్గవీరావు

తూర్పుగాలి: డా.భార్గవీరావు -సి.బి.రావు    బహుముఖ  ప్రజ్ఞాశీలి డా.భార్గవీరావు తెలుగులో ప్రసిద్ధి చెందిన రచయిత్రి, అనువాదకురాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసారు.  తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. గిరీష్ కర్నాడ్ గారి నాటకాలను తెలుగులో అనువాదం చేసి కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కాలను అందుకున్నారు. కథలు, కవితలు,నాటకాలు, నవలలు, పెక్కు అనువాదాలు చేసి అన్ని సాహిత్య ప్రక్రియలలో కృషి చేసారు. ‘మ్యూజ్‌ ఇండియా’ పత్రికకు […]

Continue Reading
Posted On :

పిట్ట గూళ్లు-యోగ్యతా పత్రం అవసరం లేని కథలు

పిట్ట గూళ్లు -సి.బి.రావు  యోగ్యతా పత్రం అవసరం లేని కథలు    కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న –శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి   కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి […]

Continue Reading
Posted On :

కొత్తకథ 2019

కొత్తకథ 2019 -సి.బి.రావు  నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము. ముఖం – రిషిత గాలంకి  ఈనాడు ఉద్యోగస్తురాలైన మహిళ, ఉద్యోగ బాధ్యలతో పాటు, ఇంటిపనులు కూడా నాలుగు చేతులతో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఐతే ఆమెకు ఉన్నది రెండు చేతులే కావటం, రెండు బాధ్యలతో తీరిక లేక, […]

Continue Reading
Posted On :

పుస్తకసమీక్ష-కొత్తకథ

కొత్తకథ -సి.బి.రావు కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు 1) అరుణ పప్పు 2) అపర్ణ తోట 3) ఝాన్సి పాపుదేసి 4) కుప్పిలి పద్మ 5) కడలి సత్యనారాయణ 6) మెర్చీ మార్గరెట్ 7) మిథున ప్రభ 8) రిషిత గాలంకి 9) […]

Continue Reading
Posted On :

యశోబుద్ధ

యశోబుద్ధ –సి.బి.రావు  కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వ్రాసిన, ఈ కాల్పనిక కథను నవలగా మలిచారు రచయిత్రి ఓల్గా. 2500 సంవత్సారాల క్రితం జరిగిన కథకు సరైన ఆధారాలు లభించటం దుర్లభమే. అయినా రచయిత్రి ఊహించి వ్రాసిన యశోధర పాఠకులను ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. కపిలవస్తు, కౌలీయ గ్రామాల మధ్యనున్న దేవాలయం లో సిద్ధార్థుని యశోధర యాదృచ్ఛికంగా చూడటం జరిగి, తొలిచూపులోనే  ఆకర్షితురాలవుతుంది. అతని ప్రవర అడిగి, తన ప్రవర చెప్తుంది. యశోధర రూపం గౌతముడి మదిలో చెరగని […]

Continue Reading
Posted On :