image_print

అమ్మా (‘పరివ్యాప్త’ కవితలు)-8

అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8 -డొంకెన శ్రీశైలం ఒడిలో కూచుంటే అమ్మ ఉగ్గన్నం తినిపించింది తన జోలపాటలతో నేను నిదుర పోయాకే అమ్మ నిదురపోయేది నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి కనపడని దేవుళ్ళకు కానుకలిస్తానని మొక్కుకునేది ఓనమాలు నేర్పి బడికి పంపేది అమ్మ వేడన్నం నాకు సద్దిగట్టి సల్దిఅన్నం సర్దుకు తింటుంది అమ్మ ఆనవాలు లేక ఆస్తినంతా అమ్మేసి బతుకుబాట చూపి ఓ ఇంటివాన్ని చేసింది అమ్మ వరిచేను ధగ్గర అమ్మ వంట దగ్గర అమ్మ వడ్డించే […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో […]

Continue Reading

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా […]

Continue Reading

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది కళ్ళముందు  గూటిపక్షులువలస పక్షులు అన్నీ అవే కోవలోఇసుమంతైనా తేడా లేదు సుమీ ! ముసిముసినవ్వుల వెనుక దాగిన మర్మం విషం గడపలో ఓ కుక్క విశ్వాసంగా అప్పుడూ ఇప్పుడూ **** గిరి ప్రసాద్ చెలమల్లుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి […]

Continue Reading

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు)

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు) -అమ్మంగి కృష్ణారావు ఇది ఒక జీవన రంగస్థలి పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు పాలిస్తుంది లాలించి తాగించి నట్టుగా పుడమి తల్లిలా నేలంతా పచ్చదనాన్ని పులుముకుంటుంది జగమంతా తనదే అన్నట్లుగా అంతా అమ్మ తత్వమే అమ్మా భూమ్మీద పడగానే ఎంత ఆనందించావో నాకు ఊహ తెలియకముందే వెళ్ళిపోయావు కదమ్మా […]

Continue Reading