ఉత్తరాంధ్రకు చెందిన రైతు ఉద్యమ నాయకురాలు “వీర గున్నమ్మ” -యామిజాల శర్వాణి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో గుడారి రాజమణిపురం అనే ఓ కుగ్రామంకు చెందిన ఒక బీద కుటుంబానికి చెందిన వ్యక్తి గున్నమ్మ. జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో రక్త బలిదానం చేసిన వీర వనిత గున్నమ్మ ఉద్దానం ఆడపడుచు. రెక్కాడితే గానీ డొక్కాడని దుర్భర జీవితంలో గున్నమ్మ పెరిగింది. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపం గా నిలిచిన వీరనారి సాసుమాను గున్నమ్మకు పదేళ్ళ వయసులోనే తల్లిదండ్రులు పెండ్లి […]
మహర్షిణి “మదాలస” -యామిజాల శర్వాణి ప్రాచీన కాలానికి చెందిన ప్రసిద్ధ బ్రహ్మవాదిని, మహర్షిణి మదాలస. విశ్వావసుడు అనే గంధర్వ రాజు కూతురు అతిలోక సుందరి. మదాలస ఈవిడ హిందూ ధర్మములో ఒక పురాణ సంబంధమైన తల్లి ఎందుకంటే తన సంతానాన్ని జ్ఞానమార్గంలో నడిపించి న వ్యక్తి ఈవిడ. ఆదర్శవంతమైన భార్యగా తల్లిగా, వేదాంతపరమైన విషయాలలో, చర్యల లో ఆరితేరిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. పాతాళకేతుడు అనే రాక్షసుడు ఆమె అందాన్ని చూసి మోహించి ఆమెను బలవం తంగా […]
వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్” -యామిజాల శర్వాణి 1790 వరకు శివగంగ సంస్థానాన్ని పరిపాలించిన రాణి వేలు నాచ్చియార్. ఈవిడ భారత దేశాన్ని ఏలుతున్న ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పై యుద్ధం చేసిన మొదటి రాణిగా ప్రసిద్ధి కెక్కింది. తమిళులు ఈవిడను “వీర మంగై ( సాహసనారీ)” అంటారు. ఈవిడ హైదర్ అలీ సైన్యం, భూస్వాములు, మరుత్తు సోదరులు దళిత కమాండర్ల అండ తో మరియు తాండవరాయన్ తో కలిసి […]
ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు -యామిజాల శర్వాణి చరిత్రలో అన్ని రంగాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలు ఎంత మందో ఉన్నారు రచయిత్రులుగా రాజకీయ వేత్తలుగా నటీ మణులుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ప్రస్తుతము కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రములో (సైన్సులో) ప్రపంచానికి వారు అందించిన సేవలను గురించి తెలుసుకుందాము. ఇప్పటికే మేడమ్ క్యూరీ లాంటి పేరు ప్రపంచవ్యాప్తముగా సైన్సు చదువుకున్న అందరికి పరిచయమైనదే. అలాగే […]
ఆడబ్రతుకే మధురము -యామిజాల శర్వాణి 1930,1940 నాటి కోస్తా ఆంధ్ర సమాజము ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు చదవాల్సిందే. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచనాలకు అద్దము పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనము చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ పూర్తిగా అర్ధము చేసుకోలేము. అయన పుట్టి పెరిగింది పూర్తిగా కరుడుగట్టిన చాదస్తపు వాతావరణము అయినప్పటికీ పరోక్షంగా బ్రిటిష్ ప్రభావము వల్ల మరియు స్వస్థలమైన తెనాలి లో ఉన్న ప్రగతిశీల భావాలు […]