image_print

బొమ్మల్కతలు-19

బొమ్మల్కతలు-19 -గిరిధర్ పొట్టేపాళెం        ప్రతి మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో తనకి తెలియని దాన్ని శోధించి తెలుసుకుని సాధించాలని పడే తపనా, చేసే ప్రయత్నాల వెంట కృషి తోడై తాననుకున్న దానికన్నా ఎక్కువగా సాధించిన సందర్భాలు కొన్నైనా ఉండి ఉంటాయి. వెనుదిరిగి చూసినపుడల్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇది నేనే చేశానా అని అనిపిస్తూ అబ్బురపరుస్తూ ఆ సందర్భాలు గుర్తొచ్చినపుడల్లా మదిలో మళ్ళీ మళ్ళీ అద్భుతంగా సందడి చేస్తూనే ఉంటాయి.     […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-18

బొమ్మల్కతలు-18 -గిరిధర్ పొట్టేపాళెం           ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు, అప్పుడే మహాగ్రంధం రాసెయ్యాలన్న తపన అన్నట్టుగా ఉండే రోజులవి, నా బొమ్మల జీవితంలో. ఒక అందమైన దృశ్యం ఏదైనా పత్రికలోనో, క్యాలెండర్ లోనో కనిపిస్తే చూసి పరవశించిపోవటమే కాదు, దాన్ని నా చేత్తో అచ్చం అలాగే అచ్చుగుద్ది మరింతగా మైమరచిపోవాలనే తపన. గ్రాఫైట్ పెన్సిల్ తో బూడిద రంగు బొమ్మల నుంచి, ఇంక్ తో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-17

బొమ్మల్కతలు-17 -గిరిధర్ పొట్టేపాళెం           సాగర సంగమం – నాకు అమితంగా నచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రం. ఏదైనా ఒక కళాత్మకమైన పనితనాన్ని పరిశీలించి చూస్తే ఎక్కడోక్కడ ఏదో ఒక చిన్నపాటి లోపం, లేదా ఇంకాస్త మెరుగ్గా చేసుండొచ్చు అన్నవి కనిపించకపోవు. ఎక్కడా ఏ మాత్రమూ మచ్చుకైనా వంక పెట్టలేని పనితీరు మాత్రమే “పరిపూర్ణత్వం” అన్న మాటకి అర్ధంగా నిలుస్తుంది. ఒక్క మనిషి చేసే ఒక పనిలో “పరిపూర్ణత” ని తీసుకురావటం […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-16

బొమ్మల్కతలు-16 -గిరిధర్ పొట్టేపాళెం           రాయటం నేర్చిన ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు ఏదో ఒక రేఖాచిత్రం గీసే ఉంటారు. ఒక మనిషినో, పువ్వునో, చెట్టునో, కదిలే మేఘాన్నో, ఎగిరే పక్షులనో, నిండు చందమామనో, లేదా రెండు కొండల మధ్యన పొడిచే సూర్యుడినో. రేఖాచిత్రాలే గుహల్లో వెలుగు చూసిన మొదటి మానవ చిత్రాలు. ఎలాంటి బొమ్మల ప్రక్రియ అయినా మొదల య్యేది ఒక చిన్న రేఖతోనే. సంతకం కింద తేదీ వెయ్యని […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-15

బొమ్మల్కతలు-15 -గిరిధర్ పొట్టేపాళెం           మనిషి పుట్టుకతోనే చుట్టూ ఉన్న పరిసరాల్నీ, మనుషుల్నీ, జీవుల్నీ చూసి అర్ధం చేసుకోవటం, చదవటం, నేర్చుకోవటం మొదలవుతుంది. మాటా, నడవడికా, ఆచరణా ఇవన్నీ పరిసర ప్రభావాలతోనే మొదలయ్యి నిత్యం ప్రభావితమవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూనే ముందుకి సాగిపోతూ ఉంటాయి. ఎంత నేర్చు కున్నా, ప్రతిరోజూ ఏదో ఒకటి, ఎంతో కొంత, కొత్తదనం ఎదురు కాకుండా ఉండదు. రోజూ ఉదయించే సూర్యుడూ ఆకాశంలో ప్రతి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-14

బొమ్మల్కతలు-14 -గిరిధర్ పొట్టేపాళెం           మొట్ట మొదటి అనుభూతి, తీపైనా, చేదైనా, ఏదైనా జీవితంలో ఎన్నటికీ మరచి పోలేము, ఎప్పటికీ మదిలో పదిలంగా ఉండిపోతుంది. చిన్నప్పడు తిరిగిన పరిసరాలు, మసలిన మనుషులు అయితే మరింత బలంగా మదిలో ముద్ర పడిపోతాయి. నేను పుట్టిన ఊరు “కావలి”, నెల్లూరు జిల్లా, చిన్న పట్టణం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ కూడా అక్కడే పుట్టింది. కానీ నా ఊహ తెలిసే నాటికి నాన్న “బుచ్చి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-13

బొమ్మల్కతలు-13 -గిరిధర్ పొట్టేపాళెం           చిన్నప్పటి నుంచీ కాయితాలంటే భలే ఇష్టం ఉండేది. పుస్తకాలంటే తెలీని పిచ్చి ఉండేది. ఏ పుస్తకం దొరికినా పూర్తిగా తిప్పందే మనసు ఊరుకునేది కాదు. నచ్చిన బొమ్మలున్న పుస్తకం అయితే ఇంక ఎన్ని గంటలైనా, ఎన్ని సార్లైనా తిప్పుతూ ఉండి పోయేవాడిని. క్వాలిటీ ఉన్న పేపర్ తో మంచి ఫాంట్ ఉన్న ప్రింట్ అయితే మహా సంతోషం వేసేది. ఏ ఊర్లో ఉన్నా లైబ్రరీలకి వెళ్ళి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-12

బొమ్మల్కతలు-12 -గిరిధర్ పొట్టేపాళెం           ఆర్ట్ పై ఉన్న ఇష్టం, నేర్చుకునే వీలు లేక, పత్రికల్లో ఆర్టిస్ట్ లు వేసే ఇల్లస్ట్రేషన్స్ బొమ్మల్నీ, ఫొటోల్నీ చూసి వేస్తూ, స్వీయ సాధనలో ఒక్కొక్క అడుగూ పడుతూలేస్తూనే ముందుకి వేస్తూ, అలా పెన్సిల్ డ్రాయింగ్స్, బాల్ పాయింట్ పెన్ స్కెచెస్ దాటి, ఫౌంటెన్ పెన్ ఇంక్, వాటర్ కలిపి బ్రష్ తో బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ లా అనిపించే బొమ్మలూ దాటి, కేమెల్ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-11

బొమ్మల్కతలు-11 -గిరిధర్ పొట్టేపాళెం “నీ నును పైటను తాకిన చాలు…గాలికి గిలిగింత కలుగునులే…”           ఈ తెలుగు పాటలోని సి.నా.రె. గారి పదాలతో అప్పుడు నేను చదువుతున్న “విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్” లో రెండు రోజులు మెరిసి మురిసిన ఈ పెయింటింగ్ నా బొమ్మల్లో ఓ ప్రత్యేకం.           ఈ పెయింటింగ్ లో కనిపించే నలుపుతెలుపుల్లోకి తొంగి చూస్తే అప్పుడే 34 యేళ్ళ జీవితం […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-10

బొమ్మల్కతలు-10 -గిరిధర్ పొట్టేపాళెం           మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్ గా, ఇంగ్లీష్, సంస్కృతం లాంగ్వేజెస్ గా ఇంటర్మీడియట్ (11th & 12th Grade) విజయవాడ “ఆంధ్ర లొయోలా కాలేజి” లో ఉత్సాహంగా చేరా. అప్పట్లో లొయోలా కాలేజిలో సీట్ రావటం కష్టం. పదవ తరగతిలో చాలా మంచి మార్కులు తెచ్చుకోవటంతో, నాన్ లోకల్ అయినా నాకు సులభంగానే సీట్ వచ్చింది, చేరిపోయాను. ఆ కాలేజిలో చదివింది రెండేళ్ళే. కాలేజి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-9

బొమ్మల్కతలు-9 -గిరిధర్ పొట్టేపాళెం దివ్య భారతి – ఒక్క పేరులోనే కాదు ఆమె అందంలోనూ దివ్యం ఉండేది, చూడ చక్కని రూపం. వెండితెర పై అతికొద్ది కాలంలోనే దివ్యమైన వెలుగు వెలిగి 19 ఏళ్ళకే చుక్కల్లో కెగసిన తార. ఇప్పుడెందరికి గుర్తుందో, 1990 దశకంలో అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో వెండితెర పైకి స్పీడుగా దూసుకొచ్చిన సి(నీ)తార. వచ్చినంత స్పీడుగానే జీవితం తెర పై నుంచీ నిష్క్రమించింది. అప్పటి వార్తాపత్రికల్లో  ఆ(మె) ఆకస్మిక […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-8

బొమ్మల్కతలు-8 -గిరిధర్ పొట్టేపాళెం  ఇండియన్ ఇంక్‌ – అప్పట్లో ఈ ఇంక్ చాలా పాపులర్. ప్రత్యేకించి బ్లాక్ అండ్ వైట్ స్కెచింగ్ చెయటానికి ఎక్కువగా ఈ ఇంక్ నే వాడేవాళ్ళు. ఇంచు మించు అన్ని బుక్ షాపుల్లోనూ దొరికేది. ఆ రోజుల్లో ఎవరో ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ వాడని ఇంక్ అయినా అంత సులభంగా అన్ని చోట్లా దొరికేది అంటే, దాని వాడకం చాలా పురాతనమై ఉండాలి. ఆర్ట్ కే కాకుండా ఇంకా చాలా విధాలా వాడుకలో […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-7

బొమ్మల్కతలు-7 -గిరిధర్ పొట్టేపాళెం          స్కూల్ రోజుల్లో చదువు, ఆటల మీదే ధ్యాసంతా. అందునా రెసిడెన్షియల్ స్కూల్ కావటంతో రోజూ ఆటపాటలున్నా చదువు మీదే అమితంగా అందరి ధ్యాసా. వారానికొక్క పీరియడ్ ఉండే డ్రాయింగ్ క్లాస్ రోజూ ఉంటే బాగుండేదనుకుంటూ శ్రద్ధగా డ్రాయింగ్ టీచర్ శ్రీ. వెంకటేశ్వర రావు సార్ వేసే బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంత బాగా వెయ్యాలని ప్రయత్నించేవాడిని. అడపాదడపా బొమ్మలంటే ఆసక్తి ఉన్న ఒకరిద్దరం ఫ్రెండ్స్ ఏవో తోచిన […]

Continue Reading
Posted On :

చిత్రం-45

చిత్రం-45 -గణేశ్వరరావు  ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడిని నిద్రలోంచి భటులు లేపే దృశ్యానికి సహజ చిత్రకారుడు బాపు అద్భుతమైన రూప కల్పన చేశారు. ట్రిక్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ రవికాంత్ నగాయిచ్ కు ‘గలివర్స్ ట్రావెల్స్’ సినిమా స్ఫూర్తి కలిగించే ఉండవచ్చు. ఆ చిత్రీకరణ రహస్యాలను ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు, చేసి చూపించమంటే మాత్రం చూపించగలరు.          ఇక పోతే ఇది ఫోటో యే, తైల వర్ణ చిత్రం కాదు. ఫోటోగ్రఫీ లో అనూహ్యమైన సాంకేతిక […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-6

బొమ్మల్కతలు-6 -గిరిధర్ పొట్టేపాళెం “తార”లనంటిన నా బొమ్మలు – “స్వర్ణ యుగం” స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి “భారతదేశ స్వర్ణయుగం” గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో “మన స్వర్ణ యుగం”. నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ […]

Continue Reading
Posted On :

చిత్రం-44

చిత్రం-44 -గణేశ్వరరావు                     ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేధిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు.                    ఈ బొమ్మ నేటి కాలానికి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-5

బొమ్మల్కతలు-5 -గిరిధర్ పొట్టేపాళెం కట్టిపడేసిన కదలిపోయిన కాలం…           ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలుగా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ప్రతి సంక్రాంతి, దసరా, వేసవి శలవులకీ “కావలి” నుంచి “నెల్లూరు” మీదుగా మా సొంత ఊరు “దామరమడుగు” కి వెళ్ళటం మాకు తప్పనిసరి. అలా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అక్కడికి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-4

బొమ్మల్కతలు-4 -గిరిధర్ పొట్టేపాళెం            తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు “ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్” గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇల్లుస్ట్రేషన్స్ స్ఫూర్తిగానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ ‘కానూరు’ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ […]

Continue Reading
Posted On :

చిత్రం-43

చిత్రం-43 -గణేశ్వరరావు  మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Wall street అక్రమణ వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్య గీతంగా మారింది –  Guantanamo ఖైదీలను, లిబియా పోరాట వీరుల ను, బైరూట్ శరణార్ధులను, ఫెర్గూసన్ పోలీసుల బాధితులను నల్లని రేఖా […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-3

బొమ్మల్కతలు-3 సితార – భానుప్రియ -గిరిధర్ పొట్టేపాళెం           కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా అప్పటి వెలుగు చూడని నా “ఇంకు పెయింటింగుల్లో” పరిపూర్ణంగా ప్రతి క్షణమూ గుర్తున్న వాటిల్లో ఇదొకటి.           సుర్రున మండిస్తూ ముందరి వరండాలోకి కటకటాలగుండా దూసుకొచ్చే సూరీడెండని ఆపగలిగే సాధనాలు అప్పట్లోనూ ఉన్నా, […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-2

బొమ్మల్కతలు-2 కొల్లేరు సరస్సు  -గిరిధర్ పొట్టేపాళెం            అప్పట్లో వెయ్యాలన్న తపనే నా “పెయింటింగ్ స్టూడియో”! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే నా పెయింటింగ్ ఫర్నీచర్లు. Bril ఇంకు బుడ్డి, అదే ఇంకు బుడ్డీ మూత (ఇదే నా ప్యాలెట్టు), మగ్గుతో నీళ్ళు…ఇవి పక్కన పెట్టుకుని  కూర్చుని బ్రష్షు పట్టుకుంటే గంటలకొద్దీ దీక్షలోకెళ్ళినట్టే, ఇక లేచే పనేలేదు.           […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-1

బొమ్మల్కతలు-1 -గిరిధర్ పొట్టేపాళెం           బొమ్మల్లో నా ఆనందం ఈనాటిది కాదు. వేసిన ప్రతి బొమ్మా ఆర్టిస్ట్ కి సంతృప్తిని ఇవ్వదేమో కానీ సంతోషాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది.           రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో “కావలి” అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, […]

Continue Reading
Posted On :