image_print

బాలల హక్కుల పోరాట యోధురాలు – డా. శాంతా సిన్హా

బాలల హక్కుల ఛాంపియన్ మరియు బాల కార్మిక వ్యతిరేక ఉద్యమకారిణి – డా. శాంత సిన్హా  -నీలిమ వంకాయల పరిచయం: డా. శాంత సిన్హా ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త. బాలల హక్కుల కోసం, ముఖ్యం గా బాలకార్మికుల రక్షణ కొరకు పోరాడిన న్యాయవాది. తన జీవితాంతం, బాల కార్మికుల ను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. ప్రతి చిన్నారికి విద్యను పొందేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించేలా చూసింది. ఈ వ్యాసం […]

Continue Reading
Posted On :

తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి

తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి  -నీలిమ వంకాయల తల్లిపాలు ఇవ్వడం అనేది సహజమైన ప్రక్రియ. ఇది తల్లికి, శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలను అందించే సౌకర్యాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతూ నే ఉన్నాయి. ఢిల్లీలోని సందడిగా ఉండే నగరంలో, ఒక ఉద్వేగభరితమైన న్యాయవాది అయిన నేహారస్త్యోగి మార్పు కోసం తపించి, మహిళలకు తల్లిపాల హక్కులు, సౌకర్యాల కోసం పోరాడటానికి తనను […]

Continue Reading
Posted On :

ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి

 ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి  -నీలిమ వంకాయల తెలుగు మహిళల ఉన్నత విద్యా కలల స్ఫూర్తి – పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి  ప్రొఫెసర్. కె.రాజేశ్వరీ మూర్తి           వేలాది మంది అమ్మాయిలకు నడక, నడత నేర్పి, భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రొఫెసర్. రాజేశ్వరీ మూర్తి ఆంధప్రదేశ్ లో తొలి మహిళా కళాశాల అయిన శ్రీ  పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి.           అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం […]

Continue Reading
Posted On :

గీతాంజలిశ్రీ

గీతాంజలిశ్రీ  -నీలిమ వంకాయల భారత రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదిక పై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలిశ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్‌ సమాధి(2018) ఆంగ్ల తర్జుమా ‘టూంబ్ ఆఫ్‌ శాండ్‌’కు 2022కు గాను ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది. “టూంబ్ ఆఫ్‌ శాండ్‌” అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి […]

Continue Reading
Posted On :

ఇలాభట్

ఇలాభట్  -నీలిమ వంకాయల మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి  ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్. మహాత్ముని జననంతో పవిత్రమైన గడ్డ అహమ్మదాబాద్ లో 1933లో  ఇలాభట్ జన్మించారు. ఇలా తండ్రి సుమంత్ భట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.  ఆమె తండ్రి న్యాయవాది. ఆమె తాతగారు డాక్టరు. ఆయన ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని జైలుకెళ్ళారు.  […]

Continue Reading
Posted On :

అన్నా మే వాంగ్

అన్నా మే వాంగ్ అమెరికన్ కరెన్సీ పై స్థానం దక్కించుకున్న అన్నా మే వాంగ్  -నీలిమ వంకాయల హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల కరెన్సీ నాణెం మీద ముద్రించబడే తొలి ఏషియన్ అమెరికన్ వ్యక్తి గా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. పెన్సిల్ తో చెక్కినట్లున్న సన్నని కనుబొమ్మలతో ఉన్న వాంగ్ చిత్రం, అమెరికా క్వార్టర్ నాణెం మీద వెనుక భాగంలో కనిపించనుంది. వివిధ రంగాల్లో అగ్రగాములై ఉన్న మహిళలకు సముచిత గౌరవం […]

Continue Reading
Posted On :

ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి

 ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి -డా. ప్రసాదమూర్తి ఇటీవల అస్సాంలో బోడో కేంద్ర పట్టణమైన కోక్రాఝార్ లో జరిగిన వంద భాషల కవిత్వ ఉత్సవంలో పాల్గొన్నాను. అక్కడి బోడో భాషా సాహిత్యాల వికాసం గురించి, అక్కడి కవులు,రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. బోడో భాషలో అద్భుత సాహిత్య కృషి చేస్తున్న ప్రొ.అంజలి బసుమతారితో సంభాషణ మరపురానిది. ఆమె కవయిత్రి,రచయిత్రి,విద్యావేత్త,ఎడిటర్,సామాజిక కార్యకర్త. 2016 లో ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక […]

Continue Reading
Posted On :