మా బతుకులు – బేబీ కాంబ్లే

-పి.జ్యోతి

సమాజంలోని ఆణిచివేతను దానివెనుక ఉన్న మానవ స్వార్ధాన్ని అర్ధం చేసుకోకపోతే వ్యక్తులుగా, మనుషులుగా మనం ఎదగలేం. ఎటువంటి అణిచివేత అయినా బలవంతులు బలహీనులను లోబరుచుకోవడానికి ఉపయోగించిన ఆయుధమే. ఆశ్చర్యంగా అణిచివేత పై పోరాటం జరిపే చాలా సందర్భాలలో అది వ్యక్తిగత ద్వేషంగా మారడం, అదే అధికార వ్యామోహంతో పోరాటాలు జరగడం కనిపిస్తుంది. అధికారం, అహంకారం ఎటువైపున్నా అది అణిచివేతకే సూచన. మానవ సమాజంలో సమానత్వం కోసం తపించే వ్యక్తులందరూ అధికారం, అహంకారం, అహంభావం, ఆధిపత్యం పై పోరు జరపాలి కాని  ఒక వర్గపు అధికారాన్ని మరొక వర్గం చేజిక్కించుకోవడం  కోసం కాదు. ఇప్పుడు పోరాట బాట పట్టిన చాలా సంస్థలు, వ్యక్తులు, అధికారాన్ని తారుమారు చేయడానికి తాపత్రయపడుతున్నారు తప్ప దాన్ని సమూలంగా రూపు మాపడానికి కాదు. ప్రూర్తి శాంతియుత ప్రపంచాన్ని కోరితే వ్యక్తిగత ద్వేషాలు అభిప్రాయాలకు దూరం జరిగి సామూహిక ప్రయోజనాల కై పని చేయవల్సిన అవసరం ఉంది. కనీసం ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికోసమే అణిచెవేతకు గురి అయిన వ్యక్తుల జీవితాలను చదవాలి. మార్పు  అంటె అధికారం ఒకరి పక్షం నుండి మరొకరి పక్షానికి చెరడం కాదు. ఆధిపత్య జులుం లేని సమాజాన్ని నిర్మించడం. ఆధిపత్య సమాజంలో అణిచివేతకు గురి అయిన ఒక దళిత మహిళ రాసిన ఈ ఆత్మకథను చదివితే అసలు సమాజంలో ఇలాంటి అన్యాయాలు ఎవరికి జరిగినా అది ఎంత అమానుషమో అర్ధం అవుతుంది. అసలు ఇటువంటి పరిస్థితులను కల్పించే సమాజం పట్ల కోపం వస్తుంది. మరెవ్వరూ ఇలాంటి జీవితాలు గడపవలసిన అవరసరం లేని సమాజం కోసం తపన పెరుగుతుంది. 

మా బతుకులుదళిత స్త్రీ ఆత్మకథ అనే పేరు మీద వచ్చిన బేబి కాంబ్లే ఆత్మకథ. మహారాష్ట్రలోని మహర్ కులంలో జన్మించిన బేబే కాంబ్లే ఆత్మకథను ముందుగాజీనా అముచ” అనే పేరుతో మరాఠీలో వ్రాసారు. దీన్ని మాయా పండిట్ ఇంగ్లీషులోకి అనువదిస్తే, బి అనురాధ గారు తెలుగులోకి  తిరిగి అనువాదించారు. డాక్టర్ అంబెద్కర్ గారి దళిత ఉద్యమంలో పాల్గొన్న బేబీ ఆత్మ కథలో భారతదేశపు కోట్లాది దళితుల జీవితాలను, వారి బాధలను చూపించే ప్రయత్నం చేశారు. హిందు మతం దళితుల పై చేసిన అత్యాచారాలను వివరిస్తూ వారిపై జరిగిన హింసను  తెలుపుతారు. దళితవాడలు ఎంతటి హీనమైన స్థితిలో ఉండేవో అక్కడి పేదరికం, మూఢవిశ్వాసాలు వారిని మనుష్యులుగా ఎదగనీయకపోవడం గురించి చెబుతూ రాస్తారు. స్త్రీలకు వచ్చే పూనకాలు, వారి నమ్మకాలు, హిందూ మతం పట్ల వారి విధేయత, బదులుగా జంతువుల కన్నా హీనమైన బ్రతుకు బ్రతకాల్సిన వారి దుస్థితి ని రచయిత్రి వర్ణించిన తీరు దళిత సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది

అగ్రకులస్థులు తమ సౌలభ్యం కోసం వీరిని ఉపయోగించుకున్న వైనం చదివితే సమాజం పట్ల అంతులేని అసహ్యం కలుగుతుందిదళితుల  అగ్రకులస్తుల వాడలలో నడవవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కర్రకి గంట కట్టుకుని నడుస్తూ ఆ గంటను శబ్దం చెసుకుంటూ తమ రాకను అగ్రకులస్థులకు చెబుతూ నడవాలని నియమం గురించి చదివినపుడు  ఎటువంటి జంతు సమాజం నుండి మనం బైటపడ్డామో అర్ధం అవుతుంది. అగ్రకులాలలో పెళ్ళిల్ల సమయంలో పెళ్ళికూతుర్ని చేసిన తరువత అమ్మయి ఇల్లు దాటకూడదని ఆమె మల మూత్రాలను ఇంటిలో పట్టి ఎత్తి శుభ్రం చేసే మహర్లకు కనీసం తినడానికి శుభ్రమైన తిండి లేకపోవడం, అగ్రకులస్థులు  తిన్న ఎంగిలి విస్త్రర్లలోని పదార్ధాలను వాటి ద్రవాలతో పాటు గంపలకెత్తి వీరికి ఇవ్వడం, అదే గొప్పగా దానంగా భావించే అగ్ర కుల అహంకారం గురించి తెలుసుకుంటే సిగ్గుపడతాం. అగ్రకులస్థుల ముందు నిటారుగా నించోకూడదని, వారిని చూసిన ప్రతి సారిజోహార్ మాయిబాప్అనాలని అలా అనని ఎడల చెప్పు దెబ్బలు తినడం అనివార్యమని చదువుతుంటే అంత నిక్రుష్టమైన జీవితాలను వారికిచ్చిన సమాజం పట్ల ఏహ్యభావం కలగక మానదు.

శవాలపై కప్పిన గుడ్డలనే వీరు ధరించాలి. మరో మంచి గుడ్డ కొనుక్కోలేరు. పాడె మీది వెదురుతో వారి ఇండ్లు కప్పుకోవాలి. అతుకుల బొంతలతో శరీరం కప్పుకోవాలి. చచ్చిన గొడ్డు మాంసాన్ని వారు కోసుకుని తినే తీరును ఆవిడ వ్రాసినప్పుడు మృగాల కన్నా హీనంగా బ్రతికిన తరాలపట్ల బాధ కలుగుతుంది. సమాజంలోని హింసను ప్రతిఘటించలేని దళిత పురుషులు, తమ స్త్రిల పై ప్రదర్సించే జులుం అత్యంత హేయం.. ఇంటి కోడల్ల పై జరిగే గ్రుహ హింస విపరీతం. కోడళ్ళ ముక్కులు కోయడం, చితకబాదడం అతి మామూలు సంఘటనలు. కోడళ్ళు పారిపోకుండా వారి కాళ్ళకు చెక్కముక్కలు పెట్టి ఇనుప గొలుసులు బిగించడం గురించి చదివినప్పుడు అమితమైన వేదన కలిగింది. అలా ముక్కుకోసిన స్త్రీలను మూడిలు అనేవారట. ఇంతటి హీనమైన జీవితాలను గడుపుతున్న వారిలో చైతన్యం తీసుకురావడానికి భీమ్(భీమ్ రావ్) చేసిన కృషి గురించి చెప్తూ అతనే తాము నమ్మిన దేవుడని బేబీ కాంబ్లే అంటారు. కాని తరువాత తమలోనే చదువుకుని అగ్రకులాల సరసన చేరి స్వార్ధంతో తమవారిని పట్టించుకోని వారి సంఖ్య పెరిగిందని వాపోతారు. బౌద్ధం పట్ల ఆకర్షణ తగ్గిందని భీమ్రావ్ ఆశయాలను మరిచిన తరం పుట్టుకొచ్చిందని బాధపడ్తారు

తన పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చి ఓపికున్నంత వరకు భీమ్రావ్ ఆదర్శాల కోసం జీవించిన బేబీ కాంబ్లే జీవితం నిజంగా ఆదర్శం. పుస్తకం చివర్న మాయపండిట్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో తాను కూడా గృహ హింసను అనుభవించానని పరిస్థితులలో మహిళకైన అది తప్పదని చెపుతారు. దళుతులపై అన్యాయాలకు కారణం వివరిస్తూ రోజుల్లోనేమో దళితులు విద్యావంతులు కాకపోవడం వల్ల ఇది జరిగింది. రోజేమో విద్యావంతులయ్యారు కనుక జరుగుతుంది. ఇప్పుడు విద్యావంతులైన దళితులు సరిగ్గా అప్పటి అగ్రకుల గ్రామస్థుల లాగాని ప్రవర్స్తిస్తున్నారుఅంటారు.

దళిత మహిళల జీవితాన్ని దళిత జీవన పరిస్థితులను చర్చించే పుస్తకం ఇది. ముఖ్యంగా అన్ని రకాలుగా దోపిడికి గురి అయ్యిన దళిత మహిళల జీవితాలను మనకు చెప్పే ప్రయత్నం చేసిన గొప్ప పుస్తకం ఇది. కనీసం ఒక్క రోజు నేటి నాగరిక స్త్రీ ఆ జీవితాన్ని గడపలేదు, ఊహించలేదు. అటువంటి పరిస్తితులలో తరాలు గడిచిపోయాయి. ఒక స్త్రీ పెద్ద చదువులేకపోయినా, ఆలోచన పెంచుకునే అవకాశాలు, పరిస్థితులు లేకపోయినా అన్ని రకాల అణీచివేతలకు గురి అయ్యి తన మేధస్స్తుతో ఆలోచించి, పరిస్థితులను పరిశిలించి, తన తోటి వారి కోసం పోరుబాట పట్టి తనకు తోచిన మార్గంలో ఎదుగుతూ, తన కుటుంబాన్ని ఒక దారికి తెచ్చి తన చుట్టు ఉన్న తోటి స్త్రిలకు ఉపయోగపడాలని తపించిన బేబీ కాంబ్లే జీవితం చాలా మందికి ఆదర్శం.    నాటి సామాజిక అంశాలపై అవగాహన కోసం ఈనాటి ఎన్నో సమస్యల మూలాల ను అర్ధం చేసుకోవడం కోసం పుస్తకం తప్పక చదవాలి.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.