
ప్రకృతి నా నేస్తం
-యలమర్తి అనూరాధ
పువ్వు నన్ను అడిగింది
దేవుని పాదాలచెంతకు నన్ను తీసుకెళ్ళావూ అని
గోడ నాకు చెప్పింది
బంధాలకూ అనుబంధాలకూ తాను అడ్డుగోడ కానని
పక్షి నాతో గుసగుసలాడింది
మాటలు రాకపోయినా కువకువల భాష తమకుందని
శునకం కాళ్ల దగ్గర చేరింది
బుద్ధివంకరకు కాదు విశ్వాసానికి గుర్తుగా తమని చూపమని
చెట్టు నన్ను స్పృశించింది
గాలి ,నీడ ,పండు సరిగా అందుతున్నాయా అని
ఆకాశం నా నీలికళ్ళతో ఊసులాడింది
నీకూ నాకూ మధ్యన వారధి చినుకుచుక్కలేనని
భూమి చిరునవ్వుచిందించింది
మంచిపనులు బాగా చేస్తున్నావని మెచ్చుకుంటున్నానని
మూగభాషలలో వేలవేల అర్ధాలు
గ్రహించే మనసు మనకు ఉంటే చాలు .
*****
ఆర్ట్: మన్నెం శారద
Please follow and like us:

యలమర్తి అనూరాధ నివాసం హైదరాబాద్. కృషాజిల్లా ముదునూరులో జన్మించారు. 1978 నుంచి కవితలు రాస్తున్నారు. అనేక సాహిత్య పురస్కారాలు పొందారు.
