
ఆమె
-సాహితి
అతడి ధైర్యం
నిజం.
ఎంత ఎండకైనా
మాడిపోడు.
మసిలి మసిలి
సహనంగా ఆవిరౌతాడు.
ప్రేమతో
మేఘమై పుట్టి
మళ్ళీ కురుస్తాడు
పగలు రేయి కుండపోతగా.
పచ్చిక ఒడిలో
మంచు బిందువులో
ఒదిగిచూస్తాడు
మొగ్గల
బుగ్గ చాటున
తొంగిచూస్తాడు.
అతని నిజం
ధైర్యం.
ఆమె కురుల
పరుపు కోరి కునుకు తీస్తాడు.
ఆమె కనుల
చాటుగా దూరి కలను దోస్తాడు.
ఆమె కలల
కౌగిట చేరి కలుసుకుంటాడు.
అతడి
నిజం
ధైర్యం
ఆమే.
*****
ఆర్ట్: మన్నెం శారద
Please follow and like us:

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
