నవవాక్యం

-గిరి ప్రసాద్ చెల మల్లు

అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.