బాపట్ల నానీలు

– డా.సి.భవానీదేవి

నీవాళ్ళు దూరమయ్యారా ?

చింతించకు .. 

మేలు చేసుంటావు 

అందుకే !

 

అమ్మ.. నాన్న.. 

వెళ్లిపోయారు 

మట్టి మరోరూపందాల్చినా 

 గుర్తించలేం  కదా..

 

శతాధిక నాటకాల పేటి  

కొర్రపాటి ….

నాటక రచనలో  

ఘనాపాఠి !

 

సాహితీ రుద్రమ 

కప్పిన తొలిశాలువా 

నాకది 

బాధ్యతా పులకరింత !

 

 బతుకంతా  నడకైనా  

 కాళ్ళనెప్పుల్లేవు  

 ఆరిపాదాలకు 

 మా ఊరిమట్టి !

 

కిలో బియ్యం 

లీటర్ కిరోసిన్ కోసం 

రోజంతా క్యూలో …

తుఫాన్ కు అంతా ఒకటే! 

 

 నాన్న వెనక 

 చేనుగట్లపై  నడక 

ఎగుడు దిగుళ్ళు 

 అర్ధమైందప్పుడే! 

 

బాల్య స్నేహితుల పేర్లు 

గుర్తురావటంలేదు 

ఫోటోలన్నీ 

మనసు ఆల్బంలో !

 

అతను 

భార్యను  కాల్చేశాడు 

రెండో పెళ్ళితో 

నిత్యం  కాలిపోతూనేఉన్నాడు

                                  

 సముద్రం ముందు 

నిలబడటం  ఇష్టం  

లేశమైనా 

గర్వం   మిగల్చని గురుత్వం !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.