
నీవు లేని రోజు
-చందలూరి నారాయణరావు
ఓ ప్రియతమా!
నీవు ప్రక్కన లేని ఒక్క రోజు
ఒక పూవు అడిగింది
నా అవసరం యిప్పుడెందుకని?
ఓ పాట నిలదీసింది
నా హాయి అవసరమేమని?
ఓ రాత్రి ఆశర్యపడింది
ఈనాటి కలను ఏమిచేస్తావని?
ఒక రోజు నీవు దూరమైతే
ఇన్ని ప్రశ్నలా?
ఇన్ని అనుమానాలా?
ఇంత అవమానమా?
ఇక తట్టుకోలేను
తల్లడిల్లుతున్నా
ఎప్పుడూ
భరింపలేను
ఎడబాటును
క్షమించు కరుణించి
రక్షించు క్షమించి
నీ ఒడిని వీడితే
లోకం ఇంత భయానకమా?
నీవు దూరమైతే
ఇంత లోపమా?
*****
ఆర్ట్: చంద్ర
Please follow and like us:

పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
