
పరామర్శ, నిర్గమనం- ఉష ఆకెల్ల అనువాద కవితలు
-నాగరాజు రామస్వామి
పరామర్శ
( Visit )
హాస్పిటల్.
కాళీమాత రక్తవర్ణ నోటిచొంగ లాం
ఎర్రెర్రని దుస్తుల్లో ఆయాలు.
క్రిక్కిరిసిన వరండాలలో కోలాహలం
కడుగుతున్న బెడ్ పాన్ల గణగణలు,
ఓదార్పుల, దూషణల రణగొణలు,
అన్ని చికాకుల నడుమ
ఆమె గదిలో బట్టలు వేలాడుతుంటవి,
గృహకలతలు చెలరేగుతుంటవి,
పెళ్ళి ముచ్చట్లు కొనసాగుతుంటవి
పరామర్శకులు పద్యాలు పాడుతుంటరు
ఆమె ఓ వృద్ధవర్షీయసి,
ఆమె కోర్కెలు తెగిన పతంగులు,
తొంటి విరిగినా తీరని మరణేచ్ఛ;
వచ్చిన వాళ్ళందరు
రాని మృత్యువును కోరుకుంటరు,
అమెరికన్ యాసల మనుమలు
ఆమె పాదాలకు మొక్కుతుంటరు,
ఆంటీలు లోనికీ బయటకూ వస్తూపోతుం
వేట కుక్క వంటి ఇంటి డాక్టరు రీ
మా నాన్న గారి మంచి మనసు
అస్పష్ట అవగాహనను శంకిస్తుంటుం
నిర్గమనం
(Departure)
ఆమె లేచి మంచంలో కూర్చుంది,
చర్మం బాధల ఉలిపిరి కాగితం,
జుట్టు కోమల తెలిపుష్ప దళం
పుడమి లోంచి పైకిలేస్తున్న లిల్
ఆమె పాల కళ్ళలో పాలిపోయిన మాతృ
రాలనున్న పండుటాకుల్లాంటి చేతు
ఒక నవజాత శిశువును ఎత్తుకున్నట్
ఏది ఆమె రక్తంలో పారాడుతుందో అదే నాలో;
నన్ను నేను దర్శించుకోగల అంతిమ
*****

వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.
