
ఓ పసిపాపా!
-పారనంది శాంతకుమారి
అందానికి అల్లరి తోడైతే అది నీవు,
అల్లరికి అమాయకత్వం నీడైతే అది నీవు,
అమాయకత్వానికి ఆత్మీయత జాడైతే అది నీవు,
ఆత్మీయతకు ఆనందం జోడైతే అది నీవు,
సంబంధానికి అనుబంధం తోడైతే అది నీవు,
అనుబంధానికి అనురక్తి నీడైతే అది నీవు,
అనురక్తికి ఆప్యాయత జాడైతే అది నీవు,
ఆప్యాయతకు ఆలంబన జోడైతే అది నీవు.
*****
Please follow and like us:

ఇల్లే నాకు సర్వం,ఇంట్లో ఉండి అందరికి వీలైనంత సేవ అందించటం లోనే ఆనందం నాకు లభిస్తుంది. ముగ్గురు మనవలతో కూడా నాకు సమయం సరిపోదు.అప్పుడప్పుడూ ఇలా కవితలను రాయటం,అంతర్జాల పత్రికలకు పంపటం చేస్తూ ఉంటాను. ఇంతకుమించి చెప్పుకోవటానికి ఏమీ లేదు.
