మొగ్గలు వికసించే చోటు

-డి. నాగజ్యోతిశేఖర్

ఆ చోటు అనగానే వేల వర్ణాలు కలలై నన్నల్లుకుంటాయి!ఆ చోటు రాగానే వెన్నెలతీగలు వరమాలలైచుట్టుకుంటాయి! నిన్నేగా భారపు హృదయాన్నిక్కడ పాతిపెట్టాను…నిన్నేగా కన్నీటి లోయొకటితవ్వాను!ఏవీ ఆ ఆనవాళ్లు…. పూల ఋతువేదో నా వేదనల్ని అపహరించింది!వెన్నెల దీపమేదోనా నవ్వులను వెలిగించింది! గాయాలను మాన్పే అగరు పూల పరిమళమేదోఈ స్థలిలో దాగుంది!గేయాలను కూర్చేసాంత్వనవేణువేదోఈ చోటులో మాటేస్తుంది! అందుకే ఆ నిశ్శబ్ద జాగాలో  నన్ను కుప్పగాపోసుకొని….తప్పిపోయిన తలపుల్ని వెతుక్కుంటాను!నన్ను నేను తవ్వుకుంటుంటాను! కలత రేయి తెల్లవారేలోగా….నా శిరస్సు శిశిరం వీడినవనశిఖరమై మెరుస్తుంటుంది!గుండె కవితై విరుస్తుంటుంది! ఆ “అక్షరమొగ్గలు”వికశించే చోటు….మీకూ తరచూ దర్శనమిస్తుంది కదూ….అపుడు నాకూ మీ ఇంటి గ్రంథాలయ తోట నుండి ఓ గుప్పెడు పరిమళాల్ని అరువివ్వండి!మీ వెలుగుపూల గదిలోనన్నో తేనెటీగై స్వేచ్ఛగా ఎగరనివ్వండి…!నాదైన భ్రమర గీతమొకటి శక్తివంతంగా వినిపిస్తాను!విశాల వినువీధిలో అక్షరాలను నక్షత్రాలుగా వెలిగిస్తాను!

****

Please follow and like us:

6 thoughts on “మొగ్గలు వికసించే చోటు (కవిత)”

Leave a Reply

Your email address will not be published.