
వ్యసనం
-డా.కాళ్ళకూరి శైలజ
గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను పందెం కాసిజవాబు దొరకని ప్రశ్నలు పావులుగా,పేరుకున్న నిశ్శబ్దాన్ని గడ్డపారతో ఎత్తిపోస్తూస్వీయచిత్రం కోసం చిరునవ్వు అతికించుకుని తుడిచేసుకునే క్షణాలు ఆక్రమించిన బ్రతుకు.ఎందుకీ పోటీ? ఎందాకా ఈ పరుగు? పిండి కొద్దీ రొట్టె లా పెట్టుబడి కొద్దీ వ్యాపారంతలపులు ఏమార్చి,తలలు మార్చే కాలంలోతిమింగలం వేట కొస్తే చిన్న చేపలు మిగలనట్టులాభాలు చాలవు,వాళ్ళకి సామ్రాజ్యాలు కావాలి. వేలికొస మీటతో శ్రమ తెలియకుండాసొమ్ము,సమయం దోచేస్తున్న కొత్త ప్రయోగం.ఏడుపు,నవ్వు;అమృతం,విషం అన్నీ అమ్ముతారుమేధనే మనసని,వస్తువే సమస్తమనీనమ్మించే ఆధునిక మాయాబజార్ ఇది. ఏ పక్షి,ఏ మృగం మారనిదిఒంటరిగా పరుగు తీస్తూమనిషొక్కడే మరో మనిషికి శత్రువౌతుంటేఅసలెక్కడిదీ వికృతి? వ్యసనమైన స్వార్ధానికి విజయ కిరీటం పెడుతూఎందుకీ పోటీ? ఎక్కడికీ పరుగు!
*****

డాక్టర్ కాళ్ళకూరి శైలజ. MBBS: కర్నూలు మెడికల్ కాలేజీలో పీ.జీ.: రంగరాయ మెడికల్ కాలేజీ లో General Surgery, DNB.Laparoscopic Surgery.FCGP ,FIAGES ప్రస్తుతం: అసోసియేట్ ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ లో పనిచేస్తున్నాను.
