
చిత్రలిపి
రేపటి ఆశాకిరణాలు
-మన్నెం శారద
ఎడతెరపి లేని వాన …..ఏడాపెడావాయిస్తూ … వరదలై ,వాగులై కొండలపైనుండి దూకుతూ ….కట్టల్ని తెంచుతూ వారధుల్ని కూల్చుతూ ……. ఇళ్లలో దూరుతూ …..కళ్ళముందే కట్టుగుడ్డల్ని .కూడా మిగల్చని కఠినమైన కరకురాతి చినుకుల్ని చూసి నిస్తేజమయిపోతుంది మనసు ! ఆహా వాన ! సుదీర్ఘ గ్రీష్మ తాపానికి వడలి ,హడలి ఏ చినుకు కోసం ఎదురుచూసామో …ఆ నీరే కన్నెరయి బీదసాదల బ్రతుకులు ముంచేస్తుంటే ….కలల పంటల్ని కాలరాస్తుంటే దయమాలిన ప్రకృతి వైపు కలతపడి చూస్తుంది మనసు ! నిర్వీర్యమైన నిరాశ నిలబడదు మరెంతో సేపు …….ఎక్కడినుండో ఒక ఆశాకిరణం నునువెచ్చగా నినుతాకుతుంది ! ఎవరిదో ఒక స్నేహ హస్తం నేనున్నానని చేతులు చాపుతుంది !వాలిన మొక్క నిరాశపడిన మనసుమరల సేదతీరి నిలబడతాయి!ప్రయాణం మరలా కొనసాగుతుంది …ఆశాపాశాల వైపు !
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
