ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి , ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి.
కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ విశేష కృషి చేశారు.
ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.
పుట్టింది హైదరాబాదు అయినా బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మారిస్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు.
1978 లో ఆంధ్రజ్యోతి పత్రికలో సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిల్లో పనిచేశారు
2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా, న్యూస్ లెటర్ ఎడిటర్ గా నీరు- పారిశుధ్య౦ విభాగ0 లో వున్నారు
అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా చేశారు.. కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు .
ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. నిర్మలకు సాహిత్యంలోనే కాక చిత్ర లేఖనం లో కూడా అభిరుచి వుంది. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ లో అనేక ప్రయోగాలు చేస్తున్నారు . కవిత్వానికి దృశ్యరూపం ఇస్తూ వీరు చేసున్న వీడియో ప్రయోగాలు యూట్యూబ్ లో వున్నాయి.
కవితా సoకలనాలు:
సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990),బాధాశప్తనది (1994), మల్టీనేషనల్ ముద్దు(2001), నివురు(2012)
కధాసంపుటాలు:
శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి (2019)
కాలమ్స్:
అచ్చులో వున్నవి – మృదంగం (2012 )
అచ్చులోకి రావాల్సినవి :
అనుభవం – (ఆంద్రప్రభ) మట్టిమనిషి గుండే చప్పుడు( మాభూమి )
మై డైరీ ( సుప్రభాతం ) ,
ఫ్రూట్ జ్యూస్ చానల్ కు గ్రీన్ థాట్ పేరుతో సమన్వయం , సంపాదకత్వం వహించిన వీడియోలు ;
ఎపిసోడ్ 1. రాత్రి , ఎపిసోడ్ 2. సావిత్రి- శ్రీదేవి , ఎపిసోడ్ 3. ఆకాశానికి భూమికి మధ్య- కవితా రూపకం ( రేడియోలో ప్రసారం) ,ఎపిసోడ్ 4. స్నేహం , ఎపిసోడ్ 5 గోడలు , ఎపిసోడ్ 6. చేదు చెట్టు, ఎపిసోడ్ 7. ది మాస్క్ , ఎపిసోడ్ 8. స్వేచ్చా స్వప్నం , ఎపిసోడ్ 9 . ప్రేమలు పరువు- హత్యలు. ఎపిసోడ్ 10. సోషల్ మీడియా ( రిలీజ్ అవాల్సి వుంది )
సాఫ్ట్ స్కిల్స్:
ఆధునిక కవుల కవిత్వానికి దృశ్యరూపం – ఫోటోషాప్ గ్రాఫిక్స్ మేళవింపుతో ఇ-బుక్ రూప౦లో రాబోతోంది
సంతకం సాహిత్య వేదిక నిర్వహణ ; కార్యక్రమ వివరాలు – కవి సమ్మేళనాలు, సాహిత్య సామాజిక సమస్యలపై చర్చలు, అనువాద సాహిత్యం, ఒక వస్తువు అనేక కోణాలు, పాటల పందిరి
అందుకున్న గౌరవాలు, పురస్కారాలు:
తాపీ ధర్మారావు స్మారక బహుమతి- 1988, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్- 1989, నూతలపాటి గంగాధర అవార్డు -1990
కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి- 1990, దేవులపల్లి కృష్ణ శాస్త్రి అవార్డు -1993, బి.ఎన్ రెడ్డి సాహితీ అవార్డు- 1994, ఎస్.బి.ఆర్. అవార్డు- 1994, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు = 1999, రంగవల్లి స్మారక అవార్డు ఫర్ బెస్ట్ జర్నలిస్ట్ – 2001, లాడ్లీ మీడియా బెస్ట్ జండర్ సెన్సిటివిటీ అవార్డు ఫర్ కాలమ్స్ – 2011
*****
Nirmala gari tho interview —-very good one
My favourite great. Writer