ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత

(కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి , ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి.

 కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ విశేష కృషి  చేశారు.  

ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.

పుట్టింది హైదరాబాదు  అయినా బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మారిస్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు.

1978 లో ఆంధ్రజ్యోతి పత్రికలో సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిల్లో   పనిచేశారు

2000 లో   అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్  గా, న్యూస్ లెటర్ ఎడిటర్ గా   నీరు- పారిశుధ్య౦ విభాగ0 లో వున్నారు  

అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా చేశారు.. కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు  .

ప్రస్తుతం  జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. నిర్మలకు సాహిత్యంలోనే కాక చిత్ర లేఖనం లో కూడా అభిరుచి  వుంది. ఫోటోషాప్ , గ్రాఫిక్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ లో అనేక  ప్రయోగాలు చేస్తున్నారు . కవిత్వానికి దృశ్యరూపం ఇస్తూ వీరు చేసున్న వీడియో ప్రయోగాలు యూట్యూబ్ లో వున్నాయి.

కవితా సoకలనాలు:

సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990),బాధాశప్తనది (1994), మల్టీనేషనల్ ముద్దు(2001), నివురు(2012)

కధాసంపుటాలు:

శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి (2019)

కాలమ్స్: 

అచ్చులో వున్నవి – మృదంగం (2012 )

అచ్చులోకి రావాల్సినవి :

అనుభవం – (ఆంద్రప్రభ)  మట్టిమనిషి గుండే చప్పుడు( మాభూమి )

మై డైరీ ( సుప్రభాతం ) ,  

ఫ్రూట్ జ్యూస్ చానల్ కు గ్రీన్ థాట్ పేరుతో  సమన్వయం , సంపాదకత్వం వహించిన వీడియోలు ;

ఎపిసోడ్ 1. రాత్రి , ఎపిసోడ్ 2. సావిత్రి- శ్రీదేవి , ఎపిసోడ్ 3. ఆకాశానికి భూమికి మధ్య- కవితా రూపకం ( రేడియోలో ప్రసారం) ,ఎపిసోడ్  4. స్నేహం , ఎపిసోడ్  5 గోడలు , ఎపిసోడ్ 6. చేదు చెట్టు, ఎపిసోడ్ 7. ది మాస్క్ , ఎపిసోడ్ 8. స్వేచ్చా స్వప్నం , ఎపిసోడ్ 9 . ప్రేమలు పరువు-  హత్యలు. ఎపిసోడ్ 10. సోషల్ మీడియా ( రిలీజ్ అవాల్సి వుంది )

సాఫ్ట్ స్కిల్స్:

ఆధునిక కవుల కవిత్వానికి దృశ్యరూపం – ఫోటోషాప్ గ్రాఫిక్స్ మేళవింపుతో ఇ-బుక్ రూప౦లో రాబోతోంది

సంతకం సాహిత్య వేదిక నిర్వహణ ;  కార్యక్రమ వివరాలు – కవి సమ్మేళనాలు, సాహిత్య సామాజిక సమస్యలపై చర్చలు, అనువాద సాహిత్యం, ఒక వస్తువు అనేక కోణాలు, పాటల పందిరి  

అందుకున్న గౌరవాలు, పురస్కారాలు:

తాపీ ధర్మారావు స్మారక బహుమతి- 1988,  ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్- 1989, నూతలపాటి గంగాధర అవార్డు -1990

కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి- 1990, దేవులపల్లి కృష్ణ శాస్త్రి అవార్డు -1993, బి.ఎన్ రెడ్డి సాహితీ అవార్డు-     1994, ఎస్.బి.ఆర్. అవార్డు- 1994, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు = 1999, రంగవల్లి స్మారక అవార్డు ఫర్ బెస్ట్ జర్నలిస్ట్ – 2001, లాడ్లీ మీడియా బెస్ట్ జండర్ సెన్సిటివిటీ అవార్డు ఫర్ కాలమ్స్ – 2011

*****

 

Please follow and like us:

One thought on “ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి”

Leave a Reply

Your email address will not be published.