తల్లివేరు

-డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం

పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే!  కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది.  అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .  రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు.

*****

Please follow and like us:

One thought on “తల్లివేరు (కవిత)”

  1. తల్లివేరు తపనను చాలా చక్కగా వ్రాశారమ్మా
    రెండు పడవల రెండవ తరానికి ఆవకాయ అన్నప్రాశన….😂 భలేగా ఉంది మీ కవిత శుభాభినందనలు 💐💐

Leave a Reply

Your email address will not be published.