
అల్లిక
-నస్రీన్ ఖాన్
సున్నితత్వం నీ చిరునామాదుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసిఅప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్కవచకుండలంలా సహజంగా అబ్బినదేమోరంకెలకైనా మృదుత్వమే జోడిస్తావ్ ఎక్కడిదో ఈ సహనంరంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసిపిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్నిటారుతనాన్నివిచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే దోస్త్ఏ చిరునవ్వులో జీవాన్ని రంగరించాలని తపిస్తున్నావ్ఎప్పుడో పావువై బరిలో ఉన్నావ్గమనించావా?క్విడ్ ప్రో కో రోజుల్లో ఇంకా నీకు మానవతా ఆలోచనలేమిటి? ఆర్ యా పార్మనసుకు గాయాలని చింతిస్తున్నావా చిందేరక్తంలో ఏ ఖుర్బానీ కోసం వెతుకుతావ్ చెప్పూఅన్నీ కలగలిసి ఒకే రంగై వెలిగిపోతూంటే నీ ఆనుభవిక వేదనకో పేరు కూడా పుట్టుకొచ్చిందిఅమాయకత్వం పేరుతో మహా మోసపోతోందివెర్రిగా నమ్మే నీ మంచితనంఫరవాలేదులేనీకై జాలి సంధించి తృప్తి పడే లోకంపైనీకు దయకలుగుతోంది కదూచిరునవ్వే నీ ఆభరణం!
*****

నస్రీన్ ఖాన్ కవిత్వం, కథలు రాస్తుంటారు. 2006లో తొలి కవిత రాసినప్పటికీ, 2016 నుంచి కవిత్వాన్ని విరివిగా రాస్తున్నారు. 2019లో ‘ౙఖ్మీ’ కవితా సంపుటి వెలువరించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆ సంస్థ వెలువరించిన ‘శ్రామిక, ఉరేనియం’తదితర పుస్తకాలకు సంపాదకురాలిగా పని చేసారు. జర్నలిజం నుంచి వచ్చిన ఈమె సాహిత్యం ఎక్కువగా మానవ జీవితంలోని నిత్య సంఘర్షణలను పట్టి చూపుతుంది. త్వరలోనే కథా సంకలనం తీసుకురానున్నారు.
