
హృదయ పుష్పకం
-సుభాషిణి ప్రత్తిపాటి
ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసినవశకానికి నాందీ వాక్యమైసుప్రభాతపు పూవై వికసిస్తుంది! తలపుల తడితో…ఊహల అల్లరితో వల్లరిగా సాగి,హృదయ కుహరంలో బీజమై…లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…తూరుపు వీణెపై పలికే నవరాగానికిజత కలిసే తాళమై….వేవేల మయూఖలుగా ఉదయించేభానుతేజమై…భావికి వెలుగయే నా కలంవేకువ పుష్పంలా కుసుమించి ప్రసూన కవనమై.. నా హృదయ పుష్పకంలోప్రభవిస్తూనే ఉంటుంది!
*****
Please follow and like us:

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.
