భూమాతలు

– సిరికి స్వామినాయుడు

వాళ్ల  త్యాగాల ముందు మనమెంత ?వాళ్ల సహనంముందు మనమెంత ? వాళ్ళు .. భూమాతలు కాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ ..అంతటి యింటిని – వాళ్లుభుజాలమీద ఇట్టే మోస్తారు ! చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు ఆశల్నీ కోర్కెల్నీ ..తమలోనే సంలీనం జేసుకొనీనిర్మల నదీప్రవాహాలై సాగిపోతారు ! వాళ్లు .. దుర్గమ అరణ్యాలు ఛేదించాలనుకుంటే .. మొలకై ప్రణమిల్లాల్సిందే వాళ్లు .. దయా కల్పవృక్షాలు కరుణపొందాలనుకుంటే .. దోసిలి పట్టాల్సిందే ! వాళ్లు .. జీవనదులు అమేయ జలగీతాల్ని వినాలనుకుంటే .‌.అంతరాంతరగాధాల్లోకి దూకాల్సిందే ..వాళ్ళు .. అమూల్యగ్రంధాలుఅర్ధంకావాలనుకుంటే ..మనసుపుటల్ని మననం చేయాల్సిందే ! వాళ్లు .‌. అగ్నిపర్వతాలు అంతు తెలియని అఘాధాలు కరుణరసార్ద్ర హిమశిఖరాలు సతత హరితారణ్యాలు వెన్నెల ఆకాశాలు .. వేకువ పూదోటలు నడచే గాయాలు .. నెత్తుటిగేయాలు !                                         వాళ్లు ..అడవిని యిల్లుజేసి హరివిల్లును ముగ్గేస్తారు పొద్దల్లా – యిళ్లమీదా .. పొలాలమీదా ..చెమటపిట్టలై ఎగురుతారు తమ పొత్తిళ్లలో..ప్రపంచాన్ని పసిపాపను జేసీ జోకొడతారు !!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.