
అనుసృజన
మీరా పదావళి (తరువాయి గీతాలు)
అనువాదం: ఆర్.శాంతసుందరి
11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీయే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హైవో బంసీ హో గయీ చోరీ(రాధా , నా బంగారూ! నా మురళిని ఇచ్చెయ్యవా?నా ప్రాణాలన్నీ ఈ మురళిలోనే ఉన్నాయిదాన్నే ఎవరో దొంగిలించారు)కాహే సే గాఊం కాహే సే బజాఊంకాహే సే లాఊం గైయా ఘేరీ(ఇక నేను దేన్ని వాయిస్తూ పాడను?అసలు దేన్ని వాయించను?మురళి లేనిదే గోవుల్ని కూడగట్టుకుని ఎలా తోలుకు రాను?)హా హా కరత్ తేరే పైయా పరత్తరస్ ఖావో మోరీ రాధా ప్యారీ( చాలా బాధపడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను.నా మీద కాస్త జాలి చూపించు రాధా నా బంగారూ!)మీరా కే ప్రభు గిరిధర్ నాగర్బంసీ లేకర్ ఛోడీ బంసీ లేకర్ ఛోడీ(మీరా ప్రభువు గిరిధర్ నాగర్చివరికి మురళి తీసుకుని కాని వదిలిపెట్టలేదు)***12. సఖీ రీ లాజ్ బైరన్ భయీశ్రీలాల్ గోపాల్ కే సంగ్ కాహే నాహీం గయీ( సఖీ, నా సంకోచమే నాకు శత్రువైందిఆ గోపాలుడి వెంట ఎందుకు వెళ్ళలేదు నేను?)చలన్ చాహత్ గోకుల్ హీ తే రథ్ సజాయో నయీరథ్ చఢాయే గోపాల్ లై గయో హాథ్ మీంజత్ రహీ( గోకులం నుంచే బైలుదేరాలని కొత్త రథం కూడా సిద్ధం చేసుకున్నాంకానీ గోపాలుణ్ణి మాత్రమే ఎక్కించుకుని రథం వెళ్ళిపోయిందినేను చేతులు నులుపుకుంటూ ఉండిపోయాను)కఠిన్ ఛాతీ స్యామ్ బిఛురత్ బిరహ్ మే తన్ తయీదాసీ మీరా లాల్ గిరిధర్ బిఖర్ క్యో నా గయీ( ఆ శ్యామసుందరుడు దూరం కావటం మనసుకి ఎంత కష్టంగా ఉందో!విరహంలో తనువు వేగిపోతోందిఆ గిరిధరుడి దాసీ ఓ మీరా ! నువ్వింకా ఛిన్నాభిన్నమైపోలేదా ?)
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
