
అక్షరం
-మన్నెం శారద
అవసరం అలాంటిది ….అర్జెంట్ గా రాయాలి. మరి ….కాగితం. కలం తెచ్చుకున్నానుఏసీ వేసుకుని కాగితంమ్మీద కలం పెట్టేనా ….ఒక్క అక్షరమూ పడదే … అదిలించి బెదిరించినా … అట్టే సోకులు పడకు … అంటూ ఎకసక్కేమాడిఎగిరెగిరి పడ్డాయి … తెల్లబోయి వాటి ఆట చూద్దునా ……..ఓయమ్మో ….. అక్షరాలు ……తక్కువేమీ కాదు కొన్ని అక్షరాలు …కుదురుగా కుదమట్టంగా …!(అ, ఇ, ఉ, ఋ, ఎ,ఐ, ఒ etc ) మరికొన్ని….పక్కనే చేరి సాష్టాంగ పడి కాళ్ళు పట్టుకుని లాగేకుటిల బడా పెద్దల్లా …. {అ..ఆ,ఇఈ,ఉఊetc} కొన్నిఅక్షరాలు…పక్కవాడి గొప్పతనాన్ని ఏ మాత్రం అంగీకరించ లేనివక్రరాయుళ్ళా వెక్కిరించి వంకరబోతూ …{కీ కూ కె కౌ కోetc} కొన్ని మాత్రం కబుర్లు చెప్పి అందలాలెక్కిఊరేగే బడా రాజకీయ నాయకుల్లా….మరికొన్ని పాపం ..వాటిని నమ్మిమోసుకు తిరిగేఅమాయకపు వోటర్లులా….{ర్ణ.స్థ,గ్ర…etc} ఇంకా కొన్ని ..తమ అస్తిత్వాన్ని కోల్పోయిపక్కనేజేరి ..సగంగా మిగిలినపరాన్న భుక్తులుగా{భ్య.త్వ,జ్నాetc} కొన్ని గుంపులు గుంపులుగా జేరి…పదాలుగా మారికొన్ని అర్ధాల్ని సృష్టించుకునిపేరాలుగా జేరి ….జీవనయానం.. సాగించే తండాల్లా…..
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
