
అమ్మసంచి
-బంగార్రాజు కంఠ
నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో ఒప్పోపదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్పఎవరికీ వుండదు ఆ చారికల సంచిప్రపంచం మొత్తం మీద అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవుకడుపు మీది ఆ బాధానంద ముద్రలుపొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టునువ్వూ నేనూ చీరే వుంటాం పొట్టలో పిండం పెరిగేకొద్దీపచ్చి పుండ్లు కుక్కుకున్న సంచిలా పిగిలిఅచ్చులు దేరుతుందినువ్వు తెలియక చేసిన గాయాల మచ్చల్నిదాచుకోవాలన్న ధ్యాసేలేని అమ్మ నీ తప్పుల్ని మాత్రం ఆ కడుపు సంచిలో దాచుకుంటుంది తన క్షణకాలం సుఖం కోసమేఅమ్మ ఈ లోకాన్ని కనలేదుతన లోకమైన నిన్ను కనడం కోసంపదిమాసాల కాలంక్షణానికో యుగాన్ని మోసిందని నీకెలా తెలుస్తుందినీకోసం ఇన్ని త్యాగాలు చేసిన బంధంఈ నేల మీద ఇన్ని యుగాలైనాఇంకొకటి కనపడిన జ్ఞాపకం వుందా !!? మనం పుట్టింది బ్రమ్మలకు కాదు మనిషీ ! అమ్మలకే !!
*****

ఏలూరు స్వస్థలం. 25 ఏళ్ళుగా కవిత్వంతో పరిచయం వున్నప్పటికీ క్రియాశీలంగా రాస్తున్నది 2016 నుంచి మాత్రమే. ఇప్పటి వరకూ “బువ్వ” “మూలాల్ని తడుముకుంటూ” కవితా సంపుటాలు తీసుకురావటం జరిగింది. ఇష్టమైన కవులు శ్రీశ్రీ, గుర్రం జాషువా. ఇప్పటి ప్రసిద్ధ కవి ప్రసాదమూర్తి కవిత్వం ఇష్టం. ఈ తరంలో ర్యాలి ప్రసాద్, శ్రీరామ్, తెలుగు వెంకటేష్ ఇష్టమైన కవులు.

చక్కటి పొయెమ్ సర్..
కవిత చాలా బావుంది సార్