
సమయం
-బండి అనూరాధ
ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా బయటా ఒకే నిశ్శబ్దం.
*****
Please follow and like us:

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.

కవిత చాలా బాగుంది అభినందనలు