
పరిష్కార దీపం
-యలమర్తి అనూరాధ
అమ్మా! ఆర్తనాదం గుమ్మంలోబిచ్చగత్తె కాదు ఎక్కడో దూరంగాబావి లోంచి వినబడనట్లు కొడుకులు వదిలించుకున్న వృద్ధుల మౌన ఘోష ఇది మన దేశమేనా !?సందిగ్దంలో పడ్డ మనసు ఒంటరి తనం చీకటిన మ్రగ్గుతున్న కర్కశహృదయాలుచివరి అంకానికి ఇదా ముగింపు ? ఆ నిముషాన కొడుకులనంతా వృద్ధులుగా మార్చాలన్నంత ఆవేశం హిప్నాటెస్ట్ నై ఒక్కసారి ఆ అనుభవాన్ని రుచి చూపించాలనిమూసుకున్న కళ్ళు అప్పుడైనా తెరుచుకుంటాయేమో?వదిలిన అనుబంధపు పాశాలు మళ్ళీ చుట్టుకుంటాయేమో!
*****
Please follow and like us:

యలమర్తి అనూరాధ నివాసం హైదరాబాద్. కృషాజిల్లా ముదునూరులో జన్మించారు. 1978 నుంచి కవితలు రాస్తున్నారు. అనేక సాహిత్య పురస్కారాలు పొందారు.

చాలా బాగుంది అమ్మ