అనుసృజన

‘నీరజ్’ హిందీ కవిత

అనువాదం: ఆర్.శాంతసుందరి

స్వప్న్ ఝరే ఫూల్ సే మీత్ చుభే శూల్ సేలుట్ గయే సింగార్ సభీ బాగ్ కే బబూల్ సేఔర్ తుమ్ ఖడే ఖడే బహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ దేఖతే రహే (పువ్వుల్లా రాలిపోయాయి కలలు/ ముళ్ళల్లా పొడిచారు మిత్రులు/తోట అందాన్ని దోచుకున్నాయి ముళ్ళపొదలు/నువ్వేమో అలా వసంతాన్నే చూస్తూ నిలబడిపోయావు/బిడారు వెళ్ళిపోయినా అది రేపిన ధూళినే చూస్తూ ఉండిపోయావు) నీంద్ భీ ఖులీ న థీ కి హాయ్ ధూప్ ఢల్ గయీపాంవ్ జబ్ తలక్ ఉఠే కి జిందగీ ఫిసల్ గయీపాత్ పాత్ ఝర్ గయే కి శాఖ్ శాఖ్ జల్ గయీచాహ్ తో నికల్ సకీ న పర్ ఉమర్ నికల్ గయీగీత్ అశ్క్ బన్ గయే స్వప్న్ హో దఫన్ గయేసాథ్ కే సభీ దియే ధుఆం పహన్ పహన్ గయేఔర్ హమ్ ఝుకే ఝుకే మోడ్ పర్ రుకే రుకేఉమ్ర్ కే చఢావ్ కా ఉతార్ దేఖతే రహే (ఇంకా మెలకువ రానే లేదు, పొద్దువాలిపోయింది/అడుగు వేసే లోపునే జీవితం చేజారిపోయింది/ఒక్కక్క ఆకూ రాలిపోయింది, కాలిపోయాయి కొమ్మలన్నీ/కోరిక తీరలేదు కానీ దాటిపోయింది వయస్సు/పాటలు కన్నీళ్ళయ్యాయి మరణించాయి కలలు/నా వెంట ఉన్న దీపాలన్నీ ఆరిపోయి మిగిలాయి పొగలు/శరీరం ఒంగిపోయి మలుపు దగ్గర ఆగిపోయి/యౌవనం కరిగి పోవటం చూస్తూ ఉండిపోయాను) క్యా శబాబ్ థా కి ఫూల్ ఫూల్ ప్యార్ కర్ ఉఠాక్యా కమాల్ థా కి దేఖ్ ఆయినా సిహర్ ఉఠాఇస్ తరఫ్ జమీన్ ఔర్ ఆసమాన్ ఉధర్ ఉఠాథామకర్ జిగర్ ఉఠా కి జో మిలా నజర్ ఉఠాఏక్ దిన్ మగర్ యహాన్ ఐసీ కుఛ్ హవా చలీకి లుట్ గయీ కలీ కలీ కి ఘుట్ గయీ గలీ గలీఔర్ హమ్ లుటే లుటే వక్త్ సే పిటే పిటేసాంఝ్ కీ శరాబ్ కా ఖుమార్ దేఖతే రహే (ఏమి యౌవనం ! ప్రతి పువ్వూ ప్రేమించేంత సౌందర్యం/ఏమి అద్భుతం! అద్దం కూడా చూసి వణికిపోయేంత అందం/ఉప్పొంగిపోయాయి ఇటు నేలా అటు నింగీ /అటు కన్నెత్తి చూసిన ప్రతి మనిషీ /గుండె చిక్కబట్టుకుని ఉండిపోయాడు/కానీ ఒకరోజు మారింది అక్కడి పరిస్థితి /ప్రతి మొగ్గా దోచుకోబడింది, ప్రతి వీధీ ఉక్కిరిబిక్కిరైంది/నేనూ అన్నీ పోగొట్టుకుని , కాలం దెబ్బలకి గాయపడి/చూస్తూ ఉండిపోయాను మద్యంలాంటి సాయంకాలపు మత్తుని ) హాథ్ థే మిలే కి జుల్ఫ్ చాంద్ కీ సంవార్ దూ(హోంఠ్ థే ఖులే కి హర్ బహార్ కో పుకార్ దూ(దర్ద్ థా దియా గయా కి హర్ దుఖీ కో ప్యార్ దూ(ఔర్ సాంస్ యూ( కి స్వర్గ్ భూమి పర్ ఉతార్ దూ(హో సకా న కుఛ్ మగర్ శామ్ బన్ గయీ సహర్వో ఉఠీ లహర్ కి ఢహ్ గయే కిలే బిఖర్ బిఖర్ఔర్ హమ్ డరే డరే నీర్ నైన్ మే భరేఓఢకర్ కఫబ్ పడే మజార్ దేఖతే రహే (చేతులున్నది చందమామ ముంగురులు సవరించేందుకే /పెదవులు విచ్చుకున్నది వసంతాలన్నిటికీ స్వాగతం పలికేందుకే/మనసులో సానుభూతి ఉన్నది దుఖితులందరినీ ప్రేమించేందుకే/నా ఊపిరి స్వర్గాన్ని ఈ నేల మీదికి దింపేందుకే/కానీ ఏమీ చెయ్యలేకపోయాను, సాయంకాలం గడిచి తెల్లవారింది/ఉప్పెనలా లేచిన అల కోటలన్నిటినీ నేలమట్టం చేసింది/నేను భయం భయంగా, నీళ్ళు నిండిన కళ్ళతో/చూస్తూ ఉండిపోయాను గుడ్డకప్పిన శవాల సమాధుల్ని ) మాంగ్ భర్ చలీ కి ఏక్ జబ్ నయీ నయీ కిరణ్ఢోలకే ధునక్ ఉఠీ ఠుమక్ ఉఠే చరణ్ చరన్శోర్ మచ్ గయా కి లో చలీ దుల్హన్ దుల్హన్గాంవ్ సబ్ ఉమడ్ పడా బహక్ ఉఠే నయన్ నయన్పర్ తభీ జహర్ భరీ గాజ్ ఏ వహ్ గిరీపుంఛ్ గయా సిందూర్ తార్ తార్ హుయీ చూనరీఔర్ హమ్ అజాన్ సే దూర్ కే మకాన్ సేపాలకీ లియే హుఏ కహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ దేఖతే రహే (నవవధువు వెలుగులు నిండిన పాపిట/ సింధూరం నింపుకుని బైలుదేరినప్పుడు/డోళ్ళు మోగాయి, లయబద్ధంగా నాట్యం చేశారు ప్రతిఒక్కరూ/అదిగో పెళ్ళికూతురు వెళ్తోంది అని అరిచారు ఉత్సాహంగా/ఊరు ఊరంతా వెల్లు చూపులు నిలపలేనంత ఉల్లాసంగా/అక్కడ విషాక్తమైన పిడుగు పడింది అంతలోనే/తుడిచిపెట్టుకుపోయింది సింధూరం చిరిగి పీలికలైపోయింది మేలిముసుగు/దూరంగా ఉన్న ఇంటినుంచి ఏమీ తెలియనివానిలా /చూస్తూ ఉండిపోయాను పల్లకీ మోస్తున్న బోయీలని )* ***           గోపాల్ దాస్ ‘నీరజ్’ ప్రసిద్ధ హిందీ కవి సినిమాలకి పాటలు రాశారు. ఈ కవితని ఆయన సినిమా కోసం రాయలేదు. ‘నయీ ఉమర్ కీ నయీ ఫసల్’ అనే సినిమాలో దీన్ని వాడు కున్నారు.మొహమ్మద్ రఫీ పాడగా, రోషన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఆ సినిమా సామాజిక సందేశం గలది. విద్యార్థులు రాజకీయాల్లో పావులుగా వాడుకోబడితే కలిగే అనర్థాలను అది చూపింది. ఈ పాటలో సంజయ్ అనే అభిమాని ముఖ్యంగా నాలుగు రకాల సందేశాలున్నాయని పేర్కొన్నాడు. వాటిని మీతో పంచుకుంటున్నాను-మీకు ఇంకా లోతైన అర్థాలు స్ఫురిస్తాయేమో ! *అవకాశం చేజారకముందే మీ కలలని సాకారం చేసుకోండి.*సమయం అనుకూలించినప్పుడే పని ప్రారంభించండి.*జీవితం చాలా చిన్నది, చెయ్యదల్చుకున్నది ఇప్పుడే చెయ్యండి .*మార్పు అనివార్యం, దాన్ని అంగీకరించండి.*మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోండి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.