
అనుసృజన
ఒంటరి స్త్రీ నవ్వు
హిందీ మూలం: సుధా అరోడా
అనువాదం: ఆర్.శాంతసుందరి
ఒంటరి స్త్రీదాచుకుంటుంది తన నుంచి తననేపెదవుల మధ్య బందీ అయిన నవ్వుని బైటికి లాగినవ్వుతుంది బలవంతంగాఆ నవ్వు కాస్తా మధ్యలోనే తెగిపోతుంది… ఒంటరి స్త్రీ నవ్వటంజనాలకి నచ్చదుఎంత సిగ్గూశరం లేనిదీమెమగవాడి తోడూ నీడా లేకపోయినాఏమాత్రం బాధ లేదు ఈమెకి… నోరంతా తెరిచి నవ్వేఒంటరి స్త్రీఎవరికీ నచ్చదుబోలెడంత సానుభూతి ప్రకటించేందుకు వచ్చినవాళ్ళుదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారుఆ సొమ్ము మరోచోట పనికొస్తుందని! ఆ ఒంటరి స్త్రీఎంత అందంగా ఉంటుందో…ఆమె ముఖాన ఒకరకమైన శూన్యభావం ఉన్నప్పుడుకళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్టు పరధ్యానంగా ఉన్నప్పుడునట్టకుండా ఒక్క వాక్యం కూడా మాట్లాడలేక పోయినప్పుడుమాట్లాడుతూ హఠాత్తుగావిషయం ఎక్కడ మొదలెట్టిందో,ఇంతకు ముందే ఏమందో మర్చిపోయినప్పుడుఅప్పుడు ఆ ఒంటరి స్త్రీ ముఖం ఎంత బావుంటుందో… (ఆమె ముఖాన అలాంటి శూన్యం పరచుకున్నప్పుడుమీరు చెప్పేది ఆమె చెవులకి చేరనే చేరదు.ఆమెని చూస్తే అనిపించదుఒక పూర్తి మనిషి ఎదురుగా నిలబడి ఉందనిమొత్తం మనిషి ఎదుట ఉన్నాసగమో ముప్పాతికో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది.మిగతా భాగం ఎక్కడ ఎవరికోసం వెతుకుతోందోఅది ఆమెకే తెలీదు.ఎంత అమాయకంగా కనిపిస్తుందో అలాటి స్త్రీ ! నవ్వు ఆమె ముఖాన ఉంటుందిఒక మాసికలా అతుక్కునిఏదో అనవసరమైన వస్తువులాచెయ్యి తగలగానే రాలిపోతుంది ముఖం మీంచి…
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
