చూపు కవాతు (కవిత)

– శ్రీ సాహితి

భయం ప్రేమించి
నిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమై
పగటి పెదవుల పై
కాలపు నల్లని నడకలకు

ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగా
ముఖంలో ఇంకి
తడిసిన కళ్ళకు పారిన బాధకు

ఎండిన కలతో వాడిన నిజం
ఓడిన మనసుతో ఒరిగిన అలోచన
పాత రోజుల వాకిట ఆశకు వ్రేలాడుతూ

గతం ముందడగేసి
జారిన నిజాలును జాలితో చేతికందిస్తే
గడ్డకట్టి కరుడుకట్టిన కోరికల్లో
ఒక్క కోరికలో కదలికొచ్చినా

మనసు చిగుర్లు వేసి
జ్ఞాపకాల తేమన
రోజూ రోజును గుచ్చి గుచ్చి
నీ ఆనవాళ్ళు కోసం
చూపు కవాతు చేస్తూనే ఉంటుంది..

*****

Please follow and like us:

10 thoughts on “చూపు కవాతు (కవిత)”

  1. మీ కవిత ” చూపు కవాతు” చాలా బాగుంది మనసులో చిగుర్లు వేసిన జ్ఞాపకాల ఆనవాళ్ల కోసం చూపు కవాతు చేయటమనే భావాన్ని చక్కగా రాసారు.అభినందలు శ్రీ సాహితీ గారు

  2. చూపు కవాతు కవిత చాలా బాగుంది. సాహితి గారికి అభినందనలు💐👏

  3. కవిత చాలా లోతుగా ఉంది. ఎంత లోతుగా అంటే నా లాంటి పాఠకునికి అర్థం కానంత. కవయిత్రి ఏం చెప్పాలనుకున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఏవో కొన్ని ఉపమ్నాలు రాసి అదే లోతైన కవిత్వమంటే చెప్పలేను కానీ, ఏ రచనైనా స్పష్టంగా ఉండి ఏదో ఒక ప్రయోజనం పొందుపరచాలి. ఈ కవిత, సాహితీ గారికే స్పష్టంగా లేదనుకుంటాను. చూపుతో ఏం కవాతు చేశారో వారికే తెలియాలి. ఇలా పచ్చిగా రాసినందికు తిట్టుకున్నా పర్వాలేదు. అయినా కవయిత్రికి అభినందనలు

  4. ఆలోచింపచేసే కవిత.
    సముద్రమంత లోతుగా ఉంది.
    కవయిత్రి ఆలోచన పొరల్లోంచి దూసుకువచ్చిన బాణం.
    కవయిత్రికి నా అభినందనలు.

  5. కవిత బాగుంది
    తప్పులు లేకుండా ఉంటే మేలు

  6. కవిత చాలా బాగుంది.ఎంతో భావగర్భితంగా వుంది.హృదయ పూర్వక అభినందనలు 💐

  7. కవిత చాలా భావగర్భితంగా వుంది.భవిష్యత్తులో గొప్ప కవయిత్రి కాగలదు

  8. ఎంతో లోతైన భావన కలిగిన కవిత. చాలా గొప్ప కవయిత్రి కాగలదని అనిపిస్తున్నది. ప్రతి పద ప్రయోగం సరికొత్తగా అనిపిస్తున్నది. సాహితి గారికి అభినందనలు…

  9. చూపు కవాతు కవిత ఒకటికి పది సార్లు చదివిన గాని నాకు అర్దం కాలేదు. ఇంకా ఏదో అస్పష్టత గోచరించింది. అంతటి భావగర్భితమైన కవిత. కవయిత్రికి అభినందనలు.

Leave a Reply to ములుగు లక్ష్మీ మైథిలి Cancel reply

Your email address will not be published.