చిత్రం-66
-గణేశ్వరరావు
1954లో తాను దర్శకత్వం వహించిన ‘7 year itch’ సినిమా ఇంత చరిత్ర సృష్టిస్తుం దని బిల్ ఊహించి ఉండడు. మార్లిన్ మన్రో థియేటర్ నుంచి బయటకు వచ్చాక టామ్ తో ‘సబ్వే నుంచి గాలి ఎంత ఉధృతంగా వీస్తోందో తెలుస్తోందా? ‘ అని అన్నప్పుడు, కింద నుంచి వీచిన గాలికి ఆమె వేసుకున్న skirt కింది భాగం కొద్దిగా పైకి లేచి, ఆమె కాళ్ళను చూపించేటట్టు బిల్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది, అక్కడ చేరిన వందలమంది మన్రో అభిమానులు, కెమెరామెన్, మీడియా జనం (అధిక భాగం పురుషులే) ఉత్సుకతను ఆపడం కష్టమైంది. అలా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో, మొహం మీద చిరునవ్వుతో, తన skirt ను కిందకు మన్రో లాక్కొంటున్న ఫోటో 20 వ శతాబ్దపు iconic image (కలకాలం నిలిచే) నలుపు-తెలుపు ఫోటో అయి కూర్చుంది.
ఈ ఫోటోలో మన్రో ధరించిన తెల్ల దుస్తులు, వేసుకున్న తెల్ల జోళ్ళు నేపథ్యంలోని చీకటితో పోటీ పడుతున్నాయి. తెల్లని నొక్కు నొక్కుల జుట్టు కూడా ఆమె చెవులకున్న పెద్ద పెద్ద పోగులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అవి అమాయకత్వంతో చూపరులను సమ్మోహితులను చేస్తున్నాయి. నలుపు-తెలుపు ఫోటో అయినప్పటికీ, మన్రో మేక్ అప్ చేసుకున్న విషయం తెలిసిపోతోంది. పెదాలు ముదురు రంగు మన్రో మొత్తం లుక్ ను, కాంతు లీనుతున్న మొహాన్ని హైలైట్ చేస్తోంది. సినిమాలో ఈ దృశ్య చిత్రీకరణ ఉద్దేశం – subway పైన ఇనుప చట్రం పై మన్రో నిలుచుని ఉన్నప్పుడు.. గాలికి ఆమె స్కర్ట్ ఎగరటం చూపించడమే అయినప్పటికీ – మన్రో ఆకాశంలో ఎగురుతూన్న దేవత స్త్రీలా భ్రమ కలిగిస్తోంది, తెలుగు చిత్రం ‘చంద్రహారం ‘లో అమాయకత్వం నింపుకున్న అమృతమూర్తి శ్రీరంజనిలా కాకుండా, మరులు కొలిపి వలపన్నే వలపులాడి సావిత్రిలా ఉంది.
ఫోటోలో ఉన్న విశేషం ఏమిటంటే – లైట్లు, కెమెరాలు ఉన్నప్పటికీ – రోడ్డుపై నున్న ఇనప చట్రం ప్రతిబింబం మనల్ని నిద్ర లేపి వాస్తవంలోకి తీసుకొస్తుంది. ఈ దృశ్యాన్ని సినిమాలో వాడనేలేదు, దానికి కారణం – బ్యాక్ గ్రౌండ్ లో ఇతర ఫోటోగ్రాఫర్లు, ప్రేక్షకులూ కనిపించడం.. ఒక వ్యక్తి మాత్రం మన్రో వైపు చూడకుండా తన మానాన తను నడుస్తూ పోతుండడం.. మరొకడు మన్రో కేసే కళ్ళప్పగించి రాతి బొమ్మలా ఉండిపోవడం. .
సినిమాలో ‘రైలు సీన్ ‘ కోసం షూట్ చేసిన టైం కొన్ని నిమిషాలే అయినా, మన్రో కోసం అక్కడ చేరిన గుంపు ఒక సర్కస్ లా తయారైంది. అందుకే ఒరిజినల్ ఫోటోను ఎడిట్ చేసారు, ఇది అపూర్వమైన వాస్తవిక snap shot ! కలకాలం గుర్తుండిపోతుంది. ఎడిటింగ్ లో ఎక్స్ట్రా లను తొలగించారు, బ్యాక్ గ్రౌండ్ ను మరింత డార్క్ గా చేసారు, ఫోకస్ అంతా మన్రో పైనే, ఆమె image ను మార్పు చేయలేదు, సూటిగా మన వైపే చూస్తూ ఉంటుంది ఆమె, కుడి చేత్తో skirt ను కిందకి లాక్కోవడంలో ఆమె బిడియం కనబరుస్తూ, ముగ్ధ మనోహరంగా ఉంది, ఎడం మోచేత్తో skirt పై భాగం అదిమి పెడుతూ, చేతిని బుగ్గ కింద ఉంచడంతో, ఆమె దాన్ని దిండు కింద వాడినట్లు అనిపిస్తుంది. ఆమె నిలుచున్న భంగిమ గమనార్హం… పొడవాటి కాళ్ళు.. ఒక దాని పై మరొకటి… శరీర భంగిమ Z ఆకారం లో ఆకర్షణీయంగా తయారైంది.. ఆమె కుడి భుజం, ఎడం భుజం కన్న కొద్దిగా పైన ఉండటం వలన, ముందుగా మనల్ని ఆకట్టుకుంటుంది, తర్వాత మన చూపు ఎడమ భుజం, కొద్దిగా వంగిన ఎడమ మోకాలు, హిప్ పైన నొక్కి పెట్టి ఉన్న skirt ..వైపు పోతుంది… ఇలా ఆ ఫోటో గురించి ఎంతైనా రాయొచ్చు. ఎడిట్ చేసిన ఫోటోను, రాబోయే తమ చిత్రానికి పబ్లిసిటీ పోస్టర్ గా వాడుకున్నారు!
ఇది ఒక అపూర్వమైన వాస్తవిక snap shot, కళాత్మక దృశ్యం! కాదంటారా?

*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.