మనసు అలలు

-సుమన జయంతి 

నిశీధి! అర చేతితో మూసిన మనసు అలరంగు రంగుల సీతాకోక చిలుకలకాంతి కలలా వేకువలో దృగ్గోచరమవుతుందిఆ లేలేత ఉదయాల నీరెండల్లోతూనీగ రెక్కలా సముద్రం అల ఆశల తీరాన్ని నుదిటిపై ముద్దాడుతుందిఆకాశం ఎరుపెక్కిన ముద్దమందారంలాఅలల నురగలపై తన చెక్కిలిని వాల్చి హృదయ రాగమాలపిస్తుంది… కరగని కాంతి సంవత్సరాల దూరాలలోకదిలే జీవనది అలలా ఈ విశ్వ ప్రేమ భావనెంత బాగుంది…! ఆకాశం ఎందుకో ఉన్నట్టుండి మేఘావృతమవుతుందిఓదార్పుకై  కడలిని హత్తుకొంటూచినుకులా రాలుతుందిఆ అలజడిని గుండె పైకెత్తుకొని అలతీరంపై కెంపులనారబోస్తుందిచుక్కపుట్టే మసక సాయంత్రం వేళకోసుకు పోయిన ఎద ఇసుక తిన్నెలపై రాతిరిలో ఆకాశం వెన్నెల దీపపు వత్తేసి జోలగా నీలాంబరి రాగమాలపిస్తుంది… కాలంతో మారని ఈ ప్రేమ దృశ్యం కరుణ కనుదోయిపై నక్షత్రాల కాంతి జావళిలా ఎంత బాగుంది….!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.