
మనసు అలలు
-సుమన జయంతి
నిశీధి! అర చేతితో మూసిన మనసు అలరంగు రంగుల సీతాకోక చిలుకలకాంతి కలలా వేకువలో దృగ్గోచరమవుతుందిఆ లేలేత ఉదయాల నీరెండల్లోతూనీగ రెక్కలా సముద్రం అల ఆశల తీరాన్ని నుదిటిపై ముద్దాడుతుందిఆకాశం ఎరుపెక్కిన ముద్దమందారంలాఅలల నురగలపై తన చెక్కిలిని వాల్చి హృదయ రాగమాలపిస్తుంది… కరగని కాంతి సంవత్సరాల దూరాలలోకదిలే జీవనది అలలా ఈ విశ్వ ప్రేమ భావనెంత బాగుంది…! ఆకాశం ఎందుకో ఉన్నట్టుండి మేఘావృతమవుతుందిఓదార్పుకై కడలిని హత్తుకొంటూచినుకులా రాలుతుందిఆ అలజడిని గుండె పైకెత్తుకొని అలతీరంపై కెంపులనారబోస్తుందిచుక్కపుట్టే మసక సాయంత్రం వేళకోసుకు పోయిన ఎద ఇసుక తిన్నెలపై రాతిరిలో ఆకాశం వెన్నెల దీపపు వత్తేసి జోలగా నీలాంబరి రాగమాలపిస్తుంది… కాలంతో మారని ఈ ప్రేమ దృశ్యం కరుణ కనుదోయిపై నక్షత్రాల కాంతి జావళిలా ఎంత బాగుంది….!
*****

సుమన జయంతి
అనంతపురం జిల్లా పెనుకొండలో జన్మించారు.
భౌతికశాస్త్రం నందు పట్టబధ్రులు అయి,
ప్రస్తుతం డివిజనల్ పంచాయతీ అధికారి అడ్మిన్ గా జిల్లా పంచాయతీ కార్యాలయం చిత్తూరు జిల్లా నందు పని చేస్తున్నారు.
గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు 2021, రాజా వాసి రెడ్డి ఫౌండేషన్ అవార్డు 2021 ని ఆమె సుమన ప్రణవ్ కలం పేరుతో రాసిన “ఎక్కడిదో ఈ రంగుల పిట్ట” కవితా సంపుటి పుస్తకానికి పొందినారు. “గజల్ గుల్ మొహర్” గజల్ సంపుటి రచించారు
