
చిత్రలిపి
ఆత్మగౌరవం !
-మన్నెం శారద
రహదారి రాక్షసులకు, రాచ బాటగా మారినప్పుడు ”కష్టమైనా నిష్ఠూరమైనా ముళ్ళ బాటనే నా నడకదారిగా ఎంచుకున్నాను నేను !ఇప్పుడు గాయమోడీ, రక్తాన్ని చిందించే నా అరికాళ్ళే కదానా ఆత్మ గౌరవానికి గీటురాళ్లు!!
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
