image_print

ఒక్కొక్క పువ్వేసి-27

ఒక్కొక్క పువ్వేసి-27 ఆధునిక తొలి స్త్రీవాద పద్య కవయిత్రి -జూపాక సుభద్ర కవయిత్రి తిలక, అభినవ మొల్ల బిరుదులు, హంస, కీర్తి పురస్కారాల గ్రహీత, ప్రధమ స్త్రీవాద ప్రబంధ కర్త, నూతన పోకడల ప్రయోగశీలి, సాహితీ సామ్రాజ్య పట్టపు రాణి, అక్షరవాణి, కవితల బాణి కొలకలూరి స్వరూపరాణి. (పుట్టింటి పేరు నడకుర్తి రత్నజా స్వరూప రాణి). పద్య కవిత్వంలో దిట్ట. గేయ కవిత్వం హైకూలు, రుబాయిలు, ద్విపద కావ్యాలు, గజల్స్, పౌరాణిక నృత్య నాటికలు, పరిశీలన గ్రంధాలు, […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-26

ఒక్కొక్క పువ్వేసి-26 చుండూరు నెత్తుటి నేరం -జూపాక సుభద్ర చుండూర్ హత్యాకాండ మీద వచ్చిన అన్యాయం తీర్పు పట్ల ఉద్యమ శక్తులు, ఉద్యమ సంఘాలు, ముఖ్యంగా హత్యాకాండ బాధితులు దళిత సంఘాలు న్యాయవ్యవస్థ ల పట్ల తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. తీర్పుపట్ల ఆగ్రహం, ఆవేశంతో కూడిన నిరసనలు తెలియజేసారు. సరియైన సాక్ష్యాలు లేవని కేసు కొట్టేయడం జరిగింది. కారంచేడు జరిగిన (1985) ఆరు సంవత్సరాలకు చుండూరు హత్యాకాండ జరిగింది.గుంటూరు జిల్లా చుండూర్ గ్రామంలో రెడ్లు మాలపల్లి మీద […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-25

ఒక్కొక్క పువ్వేసి-25 అలీసమ్మ హత్య కేసు ఎక్కడ ఏమైంది ? -జూపాక సుభద్ర కారంచేడు రుధిర క్షేత్రం భారతదేశ కులవాస్తవిక కౄరత్వానికి సాక్ష్యము. కారం చేడులో ఆధిపత్య కులంచే చంపబడిన అమరుల స్పూర్తి దినం 17-7-1985. కారం చేడులో కమ్మ కుల దురహంకారం మాదిగలను వూచకోత కోసిన దుర్దినమ్. యిది జరిగి యిప్పటికి ముప్పయెనిమిదేండ్లు (38) గడిచింది. కారంచేడు దురంతాలు భారతదేశం లో మొదటిది కాదు, చివరిది కాదు. ఆధిపత్యకుల హత్యలు అనేకం జరిగినయి, జరుగు తున్నయి. […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-24

ఒక్కొక్క పువ్వేసి-24 మహిళల్ని బత్కనియ్యుండ్రి -జూపాక సుభద్ర ఏనాడు టీవీల,పేపర్లల్ల ఆడోల్లు అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు గురిగాని రోజు వుండది, వార్త వుండది. ఆడోల్ల మీద రోజూ నేరాలు,ఘోరాలు నిత్యకృత్య మైనయి. ఒక్క టీవీలల్లనే పేపర్లల్ల వచ్చేటియే గాక యింకా వాట్స్ ఆప్ లాంటి సోషల్ మీడియాలల్ల గూడ గియ్యే వార్తలు మారుమోగుతుంటయి.యిది వరకు రోజుకో, పూటకో జరిగేటియి. యిప్పుడు దేశవ్యాప్తంగా గంట గంటకు నిమిష నిమిషానికీ నేరాలు పెరుగు తున్నయి. యాన్నో కాడ హత్యలు, అత్యాచారాలు,లైంగిక […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-23

ఒక్కొక్క పువ్వేసి-23 గీల్ల మన్ కీ బాత్ గూడ జెరయినుండ్రి సారూ! -జూపాక సుభద్ర గిదేమన్యాలమ్ సారూ… గా ఆడి పిల్లలు యెవ్వలకెర్కలేనోల్లు, ముక్కుమొకం దెల్వ నోల్లు గాక పాయె. కుస్తీ పోటీలల్ల పైల్వాం యే మొగపోరగాండ్లు గెలువని బంగారి బిల్లలు, యెండి బిల్లలు, కంచు బిల్లలు దెచ్చి దేశానికి పేరుతెచ్చిన ఆడి పిల్లలు. గిప్పుడుగా కుస్తీ ఆటలాడే ఆడిపిల్లలను మీ పార్టీలోడే, కుస్తీ సంగం పెద్దనట, వెన్క ముందు బాగా పతార వున్నోడట, తొమ్మిది సార్లు […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-22

ఒక్కొక్క పువ్వేసి-22 సమ సమాజ న్యాయమే – అంబేద్కర్ -జూపాక సుభద్ర యిది వరకు అంబేద్కర్ అంటే మాదిగ, మాలల నాయకుడనీ, వాళ్లకే సంబంధీకు డనీ మనువాదులు దూరముంచారు. మనువాదాన్ని వొదిలేయని మార్కిసిస్టులు అంబేద్కర్ బూర్జువా ప్రతినిధి అనీ, బ్రిటీష్ ఏజెంట్ అని పక్కనబెట్టి ప్రచారం చేసిండ్రు. అట్లా కమ్యూనిస్టులు అస్పృశ్య కులాలకు అంబేద్కర్ ని అందకుండా చేసిండ్రు. కానీ సామాజిక అవసరాలు, రాజకీయార్ధిక, తాత్విక అంశాలు అంబేద్కర్ని అవాచ్యమ్ చేయ లేని పరిస్థితులు. అంబేద్కర్ని తలకెత్తుకోక […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-21

ఒక్కొక్క పువ్వేసి-21 ఉద్యమాలల్ల గూడ యెట్టి సేతనే మాది -జూపాక సుభద్ర తెలంగాణ మాజీ ఎంపి, తెలంగాణ సీయెమ్ బిడ్డ,యిప్పటి ఎమ్మెల్సీ చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెట్టాలని సడన్ సడన్ గా ఢిల్లీలో ధర్నా చేసింది. ఎన్నాళ్ల నుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో బెట్టినారనీ సగం జనాభాగా వున్న మహిళ లను యింట్ల కూచోబెట్టి దేశాన్ని సూపర్ పవర్ గా,విశ్వ గురువుగా ఎట్లా మారుస్తారు?ప్రతి ఒక్కరికి వారి జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-20

ఒక్కొక్క పువ్వేసి-20 ఎన్ని చట్టాలొచ్చిన్నా చచ్చిపోని కౄరత్వాలు -జూపాక సుభద్ర భారత పాలక పార్టీ ఎంపీ ‘సతి’ ఆచారాన్ని కీర్తిస్తున్నాడంటే ఈ దేశం ఎటు బోతుంది? ఏమవుతుందనే ఆందోళన అలజడిగుంది. ఆధునిక భారతదేశాన్ని మల్లా మధ్య యుగాలకు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు రాకమానవు. యెప్పుడో రెండువందల యేండ్లనాడు నిషేధింపబడిన ‘సతీ సహగమనాన్ని’ తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా! నిజంగా “మహిళలు ఎదగాలి, సాధికారత రావాలి” అని ఉపన్యాసాలిచ్చే భారత పార్టీనాయకులు ‘సతి’ ని కీర్తించే […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-19

ఒక్కొక్క పువ్వేసి-19 యిద్దరమొస్తే … యిల్లెట్ల! -జూపాక సుభద్ర ఈ నెల (జనవరి) మూడో తేదీన ఆధునిక భారత మొదటి టీచర్, బాలికలు, అంటరాని వాళ్ళ కోసం మొట్టమొదటిగా పాఠశాలలు ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని చాలా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు (ఎస్సీసెల్స్, బీసీసెల్స్) కమ్యునిస్టు పార్టీ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, బహుజన సంఘాలు, టీచర్ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, బహుజన సంఘాలు యిట్లా అనేక సంఘాలు, సంస్థలు జరుపుతున్నారు. […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-18

ఒక్కొక్క పువ్వేసి-18 ఎవరీ.. బాధిత యువతులు -జూపాక సుభద్ర పల్లెల నుంచి పట్నాల దాకా తరుచుగా యువతులు, పిల్లలు అపహరణకు గురయ్యే కేసులకు సంబంధించిన వార్తలు చదువుతుంటాము. వాటి మీద ప్రభుత్వాలు వ్యవస్థలు తీసుకునే చర్యలు, నేరస్తులకు శిక్షలు ఏమి కనిపించయి, వినిపించయి. ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు ఒక పెద్ద సెక్స్ రాకెట్ ని బట్టబయలు చేసిండ్రు. దాదాపు పదిహేను వేల మంది యువతులను వ్యభిచార కూపంలోకి నెట్టివేస్తున్న నేర వ్యవస్థలను పట్టుకున్నారు. వీళ్ళంతా భారతదేశం […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-17

ఒక్కొక్క పువ్వేసి-17 బుద్దుడిని ప్రభావితం చేసిన తత్వవేత్త-సుజాత -జూపాక సుభద్ర ఈ మధ్య భరత దేశం నలుమూలల్నే కాక ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేసి విస్తరించిన బౌద్ధ యాత్రకు పోయినం. మా చుట్టు పక్కల వూర్ల పేర్లు, మనుషుల పేర్లు, దమ్మక్కపేట, దమ్మన్నగూడెమ్, దమ్మక్కకథలు, దమ్మక్క, దమ్మయ్య అనే పేర్లు వున్నా.,. బౌద్ధం గురించిన అవగాహన చాలా తక్కువ. (నా మొదటి కవిత్వ సంపుటి పేరు కూడా అయ్యయ్యో దమ్మక్క) క్లాసు పుస్తకాల్లో బుద్దుడి పుట్టుక, […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-16

ఒక్కొక్క పువ్వేసి-16 మహిళా సాధికారాన్ని ఆకాంక్షించిన జాషువా కవిత్వము -జూపాక సుభద్ర ప్రపంచంలో ఏ దేశంలో లేని కులవ్యవస్థ, మహిళల మీద అమానుషమైన దురాచారాలు, నిషేధాలున్నవి. స్వాతంత్రోద్యమ కాలంలో  ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన దురాచారాలున్నవి. కొన్ని సమసి పోయినా యింకా చాలా దురాచాలు మహిళల పట్ల కొనసాగు తానే  వున్నయి. భర్త చనిపోతే అతనితో పాటే చనిపోవాలనే శాసనాలు, బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతుండేవి. వితంతు, పునర్వివాహాల మీద నిషేధాలు, విద్యపట్ల నిషేధాలుండేవి. వీటన్నింటి నివారణకు […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-15

ఒక్కొక్క పువ్వేసి-15 తిరిగి జైలుకు తరమాల్సిందే -జూపాక సుభద్ర యిప్పుడు భారత సమాజము తీవ్ర అభద్రతకు ఆందోళనకు గురవుతున్నది. ముఖ్యంగా మహిళలు. ఈ దేశంలో మహిళలు, ముఖ్యంగా హిందూవేతర మతస్తులైన ముస్లిమ్ మహిళలు, దళిత ఆదివాసీ మహిళలు. ఒక వైపు మహిళలు శక్తి స్వరూపులు, వారి హక్కులు రక్షిస్తామనీ, బేటీ బచావో నినాదానాలను ప్రకటిస్తూ… యింకో వైపు నేరస్తుల్ని అందులోనూ, కరుడు గట్టిన నేరస్తులైన, బిల్కిస్ బానో కేసులో శిక్షలు బడ్డ నేరస్తుల్ని విడుదల చేసి, అధికార […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-14

ఒక్కొక్క పువ్వేసి-14 స్వాతంత్ర ఉత్సవాల్ని సంబురించగలమా! -జూపాక సుభద్ర దేశానికి స్వాతంత్ర మొచ్చి నేటికి 75సం|| అయినయని దేశమంతటా వజ్రోత్సవ అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నయి. వేరే విషయాలు సమస్యలు లేనట్లు  ప్రజలంతా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినట్లు  ఉత్సవాలు చేస్తున్నది భారత ప్రభుత్వము. దేశ సంపద శ్రామికకులాల రక్తం, చెమట నుంచి పెంపొందించబడింది. యివి వారి అభివృద్ధి కోసం జరగాలి. వారి అభివృద్ధి యింకా మిగిలే వుందనే ఎరుక దేశానికి తెలియజేస్తూ జరగాలి. యీ భారత […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-13

ఒక్కొక్క పువ్వేసి-13 స్వాతంత్ర సంరాంగణ – ఉదాదేవి -జూపాక సుభద్ర వీరాంగణ ఉదాదేవి ఝాన్సీరాణిలాగా చరిత్ర పుస్తకాల్లో, ప్రచారం లో  విస్తృతి చేయబడిన పేరుకాదు. భారత చరిత్ర పుస్తకాలకు తెలియని పేరు చరిత్రలకు వినబడని పేరు. బ్రిటిష్  సైన్యాలతో పోరాడకున్నా, ప్రాణ త్యాగం చేయకున్నా ఝాన్సీరాణి యుద్ధం చేసినట్లు అమరత్వం పొందినట్లు, వీరనారి గా చరిత్ర పుస్తకాల నిండా ప్రచారం. కానీ దళిత మహిళలు వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో, అన్ని సందర్భాల్లో దశల్లో, పోరటాల్లో, తిరుగుబాటుల్లో […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-12

ఒక్కొక్క పువ్వేసి-12 రొమ్ములు కోసి పన్ను కట్టిన ప్రాణ త్యాగి – నాంగేళి -జూపాక సుభద్ర కేరళ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బహుజన కులాల మహిళలు తమ చాతిమీద చిన్న గుడ్డ పేల్క వేసుకుంటే పన్ను కట్టాల్సిందే. కేరళ బహుజన కులాల మహిళలు రొమ్ము పన్ను మీద, రొమ్ము పన్నుల్లో కూడా వున్న వివక్షల మీద 17 వ శతాబ్దం నుంచి పోరాడు తున్నారని చరిత్రలు చెపుతున్నాయి. కేరళ బహుజన కులాల మహిళలు తమ చాతి మీద […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-11

ఒక్కొక్క పువ్వేసి-11 ఆధునిక భారత తొలి వెలివాడ రచయిత్రి -జూపాక సుభద్ర ముక్తా సాల్వే పేరు చరిత్రలో చెరిపేయలేని గొప్ప రచయిత్రి పేరు. 15-02-1855 మరియు 1-03-1855 సంవత్సరం ‘జ్ఞానోదయమ్’ పత్రిక లో ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి ‘ (Grief of the Mangs and Mahars)( మాoగ్ మహర్ల దుఃఖం) ముక్తా సాల్వే వ్యాసము రెండు భాగాలుగా వచ్చిన రచన. ఆ రచన లేవదీసిన అంశాలు ఆ కాలంలో సంచలనం. ముక్తా సాల్వే రాసిన ఈ […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-10

ఒక్కొక్క పువ్వేసి-10 విస్మృత వీర నారి ఝల్కారీబాయి -జూపాక సుభద్ర           చరిత్రను చరిత్రగా కాకుండా ఆధిపత్య కులదృష్టితో చూడడము వల్ల బహుజన కులాలకు చెందిన త్యాగాల చరిత్రలను కనుమరుగు చేయడం జరిగింది. చరిత్రంటే ఆధిపత్య కుల వ్యక్తుల చరిత్రనే చరిత్రగా చూపించుతున్నది ఆధిపత్య కులవ్యవస్థ. భారతదేశ చరిత్రలు తిరగేస్తే అణగారిన కులసమూహాల మహిళలు, మగవారు కనిపించరు. అణగారిన కులాల మహిళల త్యాగాలు, బలిదానాలు, చరిత్ర అంచుల్ని కూడా చేరని వివక్షల […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-9

ఒక్కొక్క పువ్వేసి-9 ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్ -జూపాక సుభద్ర ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, సంస్కర్తగా పని చేసిన ఆధునిక భారతదేశ మొదటి ముస్లిమ్ అధ్యాపకురాలనీ ఆమె కృషిని గురించిన సమాచారాన్ని పుస్తకంగా తెలుగు ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు. చరిత్ర పుస్తకాల్లో […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-8

ఒక్కొక్క పువ్వేసి-8 అట్టడుగు కులాలకు మహిళలకు అక్షరాలద్దిన మొదటి టీచర్ సావిత్రీబాయి ఫూలే -జూపాక సుభద్ర కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848 లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన , మొదటి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం, అంటబడని వారికి చదువు నందించడానికి శ్రమించింది.బ్రాహ్మణాధిక్య హిందూసమాజంపై తిరుగు బాటు చేసింది. మద్యపానం పై పోరాడింది. కార్మిక,కర్షక అభ్యున్నతికి ఉద్యమాలు నడిపింది. జ్యోతిబాపూలె […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-7

ఒక్కొక్క పువ్వేసి-7 సామాజిక సేవా చరిత్రలో బహుజన మహిళ -జూపాక సుభద్ర భారతదేశంలో బహుజన కులాల మహిళలు ఎస్సీ,ఎస్టీ ,బీసీలు,కొన్ని మైనారిటీ తెగలుగావున్నమహిళల జనాభా సగభాగంగా వున్న ఉత్పత్తి శక్తులు.వీరికి సామాజికంగా ఉత్పత్తి సంబంధిత జీవితమే గాని,నాలుగ్గోడల మధ్య వున్న జీవితాలు కావు. గడప దాటితేనే కడుపు నిండే జీవితాలు. వంట ఇండ్లు లేని జీవితాలు. గట్క/సంకటి/ అంబలి ఇవ్వే,కూర ఎప్పుడో ఒకసారి. పొద్దుగాల మూడు రాళ్ల పొయ్యి,సాయంత్రం పనికి బొయి వచ్చేటాలకు పిల్లి కుక్కలు ఆడే […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-6

ఒక్కొక్క పువ్వేసి-6 మద్యమ్ మత్తు నేరాలకు ఎవరు బాధ్యులు? -జూపాక సుభద్ర ఈ మద్య హుజురాబాద్ బై ఎలక్షన్స్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వము ‘దళిత బంధు’ ను ప్రకటించినట్లు మద్యం షాపుల కేటాయిపుల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% గౌండ్లవాల్లకు 15% రిజర్వేషండ్లనీ, యింకా నాలుగు వందల నాలుగు (404) మద్యం షాపులు పెంచుతున్నామని ప్రకటించింది.ఈ సంగతి టీవీలో చూసిన మా అటెండర్ విజయ వచ్చి ’ఏందమ్మా ! గీ ముచ్చటిన్నవా, తెలంగాణను ఇదివరకే కల్లుల ముంచి […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-5

ఒక్కొక్క పువ్వేసి-5 సచివాలయంలో అంటరాని బతకమ్మ -జూపాక సుభద్ర సద్దుల బత్కమ్మ పండుగ, తెలంగాణకు, అందులో శ్రమకులాల మహిళలకు ప్రత్యేకమ్. బ్రాహ్మణ, గడీ దొర్సానులు బత్కమ్మలు ఆడరు. భూస్వామ్య మహిళలు ఆడరు. యీ పండగ ఫక్తు శ్రమకులాల మహిళల పండుగ. బత్కమ్మంటే ప్రకృతి పండుగ. బూమంతా పూలు, పచ్చలు, చెరువులతో, పంటలతో కళకళ లాడే పండగ. ఆడపిల్లలంతా పుట్టింటికి చేరేపండగ. కులసమాజంలో అన్నిరంగాల్లో ’కులవివక్షలున్నట్లు, కులనిషేధాలు వున్నట్లు బత్కమ్మ పండుగ మీద కూడా నిషేధాలున్నయి. ‘ఎస్సీ మహిళలు […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-4

ఒక్కొక్క పువ్వేసి-4 -జూపాక సుభద్ర నేరాలు పట్టని ఘోరాలు ‘సారూ మాది నక్కలగండి, దేవరకొండ పాజెట్టుల భూమికి బాసినోల్లము. భూమి వోయిందని నాకొడుకు సచ్చిపోయిండు. బతికే బతుకుదెరువు లేక నాసిన్నకొడుకు పెండ్లం పిల్లలతోని పట్నమొచ్చి ఆటో తోల్కుంటుండు. నా కోడలు మిషినికుడ్తది. ముగ్గురు పిల్లల్తోని యెట్లనో కాలమెల్లదీత్తండ్రు. వూల్లేమి గాలిపోయిందని మేంగూడ యెక్కువ యీ బస్తిల్నేవుంటము. యిది సింగరేని కాలనీ బస్తంటరు. గీ బస్తిల మాయిండ్లు 10, 20 గజాలల్ల నాలుగు రేకులు దొర్కితె సాలు, గోడలు […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-3

ఒక్కొక్క పువ్వేసి-3 భారతక్రీడలు – కులజెండర్ వివక్షలు   –జూపాక సుభద్ర మగవాల్లు బలాడ్యులనీ, ఆడవాల్లు అబలులనీ అవమానకరంగా ప్రచారంచేస్తున్న ఆదిపత్యకుల మగ సమాజము ఒక్కసారి పొలాలకు, అడవుల్లకు పోయి పనిచేసే ఆడవాల్లను గమనించండి తెలుస్తది శ్రమ కులాల మహిళల ప్రతాపములు, బలాలు. పొలాల్లో మగోల్లకంటే ఎక్కువ బరువులెత్తేవాల్లు మగవాల్లకంటే ధీటుగా పనిచేసే మహిళలు కోకొల్లలుగా కనిపిస్తుంటరు. అడవిలో చెట్లు కొట్టగలరు, పెద్ద పెద్ద మొద్దులు మోయ గలరు. పులుల్ని, విషజంతువుల్ని గూడ వేటాడగలరు. వాల్లకు ఆరుబయలు, […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-2

ఒక్కొక్క పువ్వేసి-2 మరియమ్మలు మనలేని భారత్   –జూపాక సుభద్ర ఈ దేశంలో మరియమ్మ వంటి దళిత మహిళల మీద బైటి మనుషులు కాదు, ప్రభుత్వ పోలీసు యంత్రాంతమే హత్య చేసినా పౌర సమాజాలు పలుకయి, ఒక్క కొవ్వొత్తి వెలగది, ఒక్క నిరసన నినదించది, ఒక్క అక్షరమ్ అల్లుకోదు, ఏ ఉద్యమ దుకాణాలు ఉలకవు, మహిళా కమిషండ్లకి, సంగాలకు మనసురాదు. చీమ చిటుక్కమన్నా డైరెక్ట్ లైవులతోని చెప్పిందే పదిసార్లు చెప్పి సంచలనాలు వండే టీవీ చానెల్లు యీ […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-1

ఒక్కొక్క పువ్వేసి-1 స్మశానంలో కూడా చావని ఆంక్షలు   –జూపాక సుభద్ర ఈ మద్య ఒక సెలెబ్రిటీ భర్త చనిపోతే… భర్త శవయాత్రతో పాటు సాగింది నిప్పు కుండతో…. పాడెమోసింది, అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దీనిమీద ఆమెను తిట్టిపోసిండ్రు హిందూకులాలు. ‘ఒక ఆడది పాడెమోయొచ్చా, శవయాత్రలో నడవొచ్చా, చితికి నిప్పు పెట్టొచ్చా’ హిందూ సనాతన విలువలు తుంగలో తొక్కిందనీ విమర్శల మీద విమర్శలు. ఆడవాల్లు అంతరిక్షంలోకి పోతున్న యీ కాలంలో యింకా యీ మగ ధిపత్యాలేంటి? మాదుక్కాలమీద […]

Continue Reading