image_print
gavidi srinivas

పల్లె పిలుస్తోంది…! (కవిత)

పల్లె పిలుస్తోంది…! -గవిడి శ్రీనివాస్ చిగురుటాకుల్లో  వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను. ***** గవిడి శ్రీనివాస్  […]

Continue Reading
Posted On :
gavidi srinivas

కొన్ని పరిమళాలు (కవిత)

కొన్ని పరిమళాలు -గవిడి శ్రీనివాస్ నలుగురితో  మాట్లాడుకోవటంపక్షుల కిలకిల రావాలు వినటంవనాలు పచ్చని తోరణాలు కట్టటంమొగ్గలు వీడి గాలితో పలకరించటంగాలి చేరి హృదయాలు వికశించటం ఇసుక తెన్నెల్లో  కూర్చునిఎగసే కెరటాల్ని చూడటం చుట్టూ ఊగే దృశ్యాల్నికళ్ళల్లో వొంపుకోవటంఆస్వాదించటం నాలో సంచరించే కొన్ని పరిమళాలు. వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటంవర‌్షధారల్ని నింపుకోవటం ఆశగాఆకాశం వంకాహరివిల్లు వంకాకొంచెం కొత్తగా చూపుల్ని ఆరేసుకోవటంనాకింకా అలానే ఆనందాలు పొద్దు పొడుస్తున్నాయి. దేహమంతా పరవశంతోఅనేక దీపాలుగా వెలుగుతుంది. చిన్ని కొండలనూ ఎక్కి దృశ్యాల్ని నింపుకుంటాను. పిల్లకాల్వలో గెడ్డలలోచేపలు పట్టుకుంటాను కొన్ని పరిమళాల్నినాతో అంటిపెట్టుకుంటాను. ***** గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం […]

Continue Reading
Posted On :
gavidi srinivas

అదే వర్షం…! (కవిత)

అదే వర్షం…! -గవిడి శ్రీనివాస్ వేకువల్లే వేయి కలలు వెలిగించుకుని తూరుపు కాంతులు పూసుకుని చూపులు మార్చుకున్న రోజులు కళ్ల పై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటే కళ్ళలో  వెలిగే దీపాలు దారిచూపటం . మనసున ఊగే భావాలు ఊరించటం అలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లో అలా ఊగిపోవటం బంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలా వెన్నెల  ఆకాశాన్ని వొంచి తల నిమురుతూంటేనూ… లోలోపల జ్ఞాపకాలు  తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలి వొలికి చిలికి […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పొలం ఒక బంధం (కవిత)

పొలం ఒక బంధం -గవిడి శ్రీనివాస్ కాసిన్ని చినుకులు రాలటం కాబోలు నాల్గు మడి సెక్కలు సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి. ఉత్సాహం ఉత్సవమౌతూ కళ్ళల్లో వరి కలల కాంతులు దర్శిస్తున్నాడు రైతు . గుంపు కొంగల బారులా వరినాట్లు నాటిన ఆడోళ్ళు. నిజమే కదా మట్టిని తాకిన పాదాలు మొక్కలై  ఎదుగుతుంటాయి . నడిచిన  మట్టి మీద మమకారపు  పొరలు విప్పుకుంటాయి . అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని పంట చేల కోసం పాట మొలుస్తుంది . రేపటి భయాలని […]

Continue Reading
Posted On :
gavidi srinivas

యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు (కవిత)

యుద్ధం  ఒక అనేక విధ్వంస దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ యుద్ధం ఎపుడు విధ్వంసమే విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు . ఆధిపత్యం పోరు ప్రాణాల్ని ఛిద్రం చేస్తుంది . అండ చూసుకొని ఒక చిన్న దేశం అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం యుద్దానికి తెరలేపాయి. శూన్యాన్ని విధ్వంసం చేసి ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి రక్తపు మడుగుల వాసన తో యుద్ధం తడిసిపోతోంది. నాటో వ్యూహాల మధ్య దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బతకడమంటే మూడో ప్రపంచ […]

Continue Reading
Posted On :
gavidi srinivas

తీపి దుఃఖాలు (కవిత)

తీపి దుఃఖాలు -గవిడి శ్రీనివాస్ ఒక అసంపూర్ణ సంధ్యాకాలం నీ విచ్చిన సంతోషంతో నువ్ పంపిన సందేశంతో ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా . ఒక్క మాట చెప్పు నీ తపస్సులో ఉషస్సుని చూస్తున్న నాకు ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..! నీ చూపులు వెన్నెల్ని కురుస్తున్నపుడు నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన అనురాగ మధురిమల్ని  ఏరుకుంటున్నపుడు నాలో […]

Continue Reading
Posted On :