image_print

దీక్ష (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

దీక్ష (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -లలిత గోటేటి             సమయం  సాయంత్రం నాలుగు గంటలు అయింది. అనుకున్నట్టుగానే డ్రైవర్ రాజు వచ్చేశాడు. నేను విజయనగరం వచ్చి  ఇరవైనాలుగు  గంటలు గడిచింది.నిన్న రాత్రి  జరిగిన నా కజిన్ కూతురు పెళ్లి కి వచ్చాను. నిజానికి పెళ్లి కంటే శాంతిని చూడాలన్నదే నా కోరిక. విజయనగరంలో పెళ్లి అనగానే నా మనసు ఎగిరి గంతేసింది. జీవితం ఎంత పొడుగ్గా సాగి నా, […]

Continue Reading

ఎరుక (కథ)

ఎరుక -లలిత గోటేటి మార్గశిరమాసం  సాయంత్రం  ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్  కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా  విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర  పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న మనుషులు అక్కడక్కడ కనబడుతున్నారు. తాను ఎక్కడికి వెళుతోంది  తనకే తెలియదు అనుకున్నాడు శ్రీధర్. కారును ఓ పక్కగా ఆపి,డోర్ లాక్ చేసి,చుట్టూ పరికిస్తూ నిలబడ్డాడు. చేను గట్టునున్న కాలిబాట మీద నడుస్తూ ముందుకు వెళ్ళాడు. […]

Continue Reading

గమనం (కథ)

గమనం -లలిత గోటేటి “ఈ రోజు పనమ్మాయి రాలేదా? భర్త అడిగిన ప్రశ్నలో పనమ్మాయి గురించిన ఆరా కంటే “నువ్వింకా తెమలలేదా” అన్న భావమే ధ్వనించింది ఉమకు “టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది” అన్నాడు అసహనంగా సుధాకర్. ఈ చలి వాతావరణానికి రాత్రంతా దగ్గుతూండటం చూస్తూనే వున్నాడు. తానొక యంత్రంలా తిరుగుతూండాలి కాబోలు. ఒక్కరోజు కూడా ఈ యంత్రం ఆగకూడదు మరి. ఇద్దరు చిన్న పిల్లల్ని లేపి, స్కూల్కు సిద్ధం చేసి, పాలు, టిఫిన్ పెట్టి వాళ్ళకు లంచ్ […]

Continue Reading

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -వడలి లక్ష్మీనాథ్ “రోజంతా బాగున్నారు కదా! తీరా బయలుదేరే ముందు ఏంటా పిచ్చి నడక. నడవలేనట్టు ఇబ్బందిగా” అంది పంకజం, అందరి వీడ్కోలు అయి కారు బయలుదేరాకా. “అమ్మాయి పంపిందని ఆ జీన్స్ ప్యాంటు వేసుకున్నాను. కానీ, అడుగు తీసి అడుగుపడలేదే పంకజం” వాపోయాడు పరంధామయ్య. “కొత్త బట్టలు ఇవ్వగానే, పూల రంగడిలా వేసుకొని, కొత్త ఐఫోనుతో […]

Continue Reading
chandini

అర్హత (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

 అర్హత (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -చాందినీ బళ్ళ యశోదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ – అయిదవ ఫ్లోర్** బిల్డింగ్ ఎంట్రన్స్ లో ఉన్న బోర్డు పై ఈ వివరాలు చూసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ తలుపు మూసుకునేలోగా పరిగెత్తుకు వెళ్ళిందిసుభద్ర.. ఆమె రావడం చూసి చేయి పట్టి లిఫ్ట్ ఆపాడు లోపల ఉన్న సారథి. “థాంక్యూ” అని నవ్వింది సుభద్ర. పక్కనే ఉన్న శరత్ ని కూడా […]

Continue Reading
Posted On :

నవ్వే బంగారమాయెనే (కథ)

నవ్వే బంగారమాయెనే -అక్షర ‘’ఎందుకే అంత నవ్వు?’’ అంటూ నాన్నగారు, ‘’మాకెవరికీ నవ్వురాదేం? ఏంటా జోకు? చెబితే మేము కూడా నవ్వుతాం కదా. కారణం లేకుండా అయిన దానికి, కాని దానికి అలా నవ్వుతుంటే నిన్ను పిచ్చిదానివి ఉంటారు. జాగ్రత్త.’’ అంటూ అన్నయ్య, ‘’ఏంటో దీని నవ్వు ఇదీను. ముందు ముందు ఎన్ని అపార్థాలూ, కలతలు తెచ్చి పెడుతుందో’’ అని అమ్మ నా నవ్వు గురించి వాళ్ల భయాలు, బెంగలు  చెబుతుండేవారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ […]

Continue Reading
Posted On :

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -శాంతిశ్రీ బెనర్జీ సాహిత్య వాళ్ళమ్మ అలమారలో మంచి చీర కోసం వెతుకుతుంది. ఆ రోజు సాయంత్రం జూనియర్స్‌ ఇచ్చే ఫేర్‌వెల్‌ పార్టీకి అమ్మ చీర కట్టుకుని, చక్కగా రెడీ అయి కాలేజీకి వెళ్ళాలని ఆమె ఆరాటం! అలమారలో ఉన్న చీరల్లో ఏది నచ్చలేదు. ఇంతలో ఆమె దృష్టి వాళ్ళమ్మ పాత ట్రంకుపెట్టె మీదకు మళ్ళింది. ”అందులో కూడా అమ్మ చీరలుండాలి కదా!” […]

Continue Reading

గూడు (తమిళ అనువాదకథ)

గూడు తమిళం: రిషబన్  -తెలుగు సేత: గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికీ రావడానికి పావు గంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక… అమ్మయ్య! నా ఆందోళన ఎక్కువ కాక ముందే అమ్మ వచ్చేసింది. […]

Continue Reading
Posted On :

స్వాభిమాని (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

స్వాభిమాని -రామలక్ష్మి జొన్నలగడ్డ ‘‘పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి, మరో కథని ఎంపిక చేసి పిడిఎఫ్‌ పంపాం. టైమెక్కువ లేదు. చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోనుకోసం ఎదురు చూస్తుంటాను’’ అంది పద్మజ ఫోన్లో. సరళ గవర్నమెంటు ఉద్యోగంలో రిటైరై వృద్ధాశ్రమంలో ఉంటోంది. కథలంటే ప్రాణం. ఏటా మూణ్ణెల్లకోసారి తాను గౌరవించేవారి పేరిట పోటీలు ప్రకటిస్తుంది. కథల ఎంపికకు లబ్దప్రతిష్ఠుల సహకారం తీసుకుంటుంది. వాటిలో బహుమతికి ఎంపికైన […]

Continue Reading

ఆగిపోకు సాగిపో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

ఆగిపోకు సాగిపో మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన  ఉత్తమ కథ -పి.వి.శేషారత్నం ‘హరిణీ! నువ్వు వచ్చే లోగా అందమైన పొదరిల్లు రెడీ చేయాలని ఆఫీసుకు కాస్త దూరమైనా ఇదిగో వీళ్ళు తీసుకున్నాను బాగుందా ? ‘ భర్త  అర్జున్‌ మాటలు వింటూ గేటు లోకి అడుగు పెట్టి ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది హరిణి. ‘ఆ ఆ..మరదలు పిల్లా! నాకు ఆడపడుచు కట్నం చదివించుకుని కుడికాలు ముందు లోపల పెట్టు’ అకస్మాత్తుగా తలుపు […]

Continue Reading
Posted On :

కళ్ళల్లో ప్రాణాలు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

కళ్ళల్లో ప్రాణాలు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ) -జి . ఎస్. లక్ష్మి  “కాట్” గట్టిగా వినిపించిన కేకకి ఎక్కడో దూరంగా కూర్చుని లెక్కలు చూసుకుంటున్న ఆ సినిమా నిర్మాత లోకనాథం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గబుక్కున షూటింగ్ స్పాట్ వైపు చూసేడు. చిరాకు పడుతూ డైరెక్టరు శ్రీహర్ష ప్రొడక్షన్ మేనేజర్ శేషాద్రిని చూస్తూ గట్టిగా ఏదో అంటున్నట్టు కనిపించింది. జోరుగా జరుగుతున్న షూటింగ్ కి “కట్” చెప్పిన డైరెక్టరు, మేనేజర్ […]

Continue Reading
Posted On :

మంకుపట్టు (హాస్య కథ)

మంకుపట్టు -వసంతలక్ష్మి అయ్యగారి కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ  యీడురాగానే జరిపారు. అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. వీర్రాజు గారు తమవైపుబంధువులపెళ్లిళ్లెన్నో  మధ్యవర్తిత్వం జరిపి చేయించిన ఘనతకలిగినవారు.స్వంతానికి కొడుకుపెళ్లి విషయంలో బొత్తిగా  విఫలమవడం బంధుమిత్రులందరినీ ఆశ్చర్యంలో ముంచింది. కాంతమ్మగారిది ప్రతి విషయంలోనూ అవసరానికి మించి వంకలుపెట్టే గుణం. దొడ్డచేయి. పెట్టుపోతలు అన్నీ బ్రహ్మాండం. కూతుళ్ల పెళ్లిళ్ల […]

Continue Reading

రంగయ్య స్నేహం (‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ)

రంగయ్య స్నేహం (‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ) -వెంకట శివ కుమార్ కాకు నేల మీద పగుళ్లు వున్నాయి. నెత్తి మీద సూరీడు భగ్గున మండుతున్నాడు. ఆ నేలని హత్తుకొని పడుకున్నాడు రంగయ్య. రంగయ్య కన్నీటి తో దాహం తీర్చుకుంది ఆ నేల. అతని ఎండిన శరీరం ఎండిన నేల తో కబుర్లు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిరకాల మిత్రులు! రంగయ్య రైతు కుటుంబం లో పుట్టాడు. చిన్నప్పుడే తల్లి చని […]

Continue Reading

అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్   1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు. వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను  ఆ ఉత్తరాన్ని […]

Continue Reading
Posted On :

ఆలాపన (కథ)

ఆలాపన        -గోటేటి లలితా శేఖర్ సంధ్య ముఖంలో  అందం, ఆనందం ఒకదానితో ఒకటి   పోటీపడుతున్నాయి . “ సూర్య మెసేజ్ పెట్టారా?……….నిజంగానేనా……?”   ఉద్వేగంగా అడిగాను. సంధ్య నవ్వుతూ   అవునన్నట్టు తలూపింది. “ జ్యోతీ …….” వీలుచూసుకుని వస్తావా? నిన్ను  చూడాలని ఉంది. “ అంటూ  సంధ్య పెట్టిన  మెసేజ్  చూసుకుని  రెండు రోజులు  ఆఫీసుకి లీవ్ పెట్టి   రాజుతో చెప్పి బయలుదేరాను..  హైదరాబాద్ నుంచి విజయవాడకు  ప్రయాణం చేసిన  సమయమంతా సంధ్య […]

Continue Reading