అనుసృజన- లీవ్ మి అలోన్

      హిందీ మూలం  -సుధా అరోరా 

                                          అనువాదం : ఆర్.శాంతసుందరి 

నాకప్పుడు పద్ధెనిమిదేళ్ళు

కలల రెక్కల మీద తేలిపోతూ

ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేదాన్ని

సీతాకోక చిలుకలుండే లోకంలో 

రంగు రంగుల పూల తోటల్లో 

అగరొత్తుల మెత్తటి సువాసన

చిన్నగా వెలిగే దీపజ్వాల

హఠాత్తుగా అమ్మ వచ్చి నిలబడుతుంది నా వెనకాల

నేను విసుగ్గా అంటాను

అబ్బ ,అమ్మా లీవ్ మి అలోన్

నా స్పేస్ నాకిస్తుంది అమ్మ

నా మీద పూర్తి నిఘా మాత్రం పెడుతుంది

నావైపే చూస్తూ ఎప్పుడైనా దిగులు రేఖ

నా మొహం మీది కాంతిని ఏమాత్రం తుడిచేసినా

ఆ రోజు చేస్తుంది నాకిష్టమైన హల్వా 

ఏలకుల పొడి కలిపి

జీడిపప్పూ , కిస్ మిస్ పళ్ళతో అలంకరించి

మాట్లాడకుండా ఉంచుతుంది నా ముందు

అమ్మ మొహం మీద అప్పుడు ఉంటుంది చిరునవ్వు

నా మొహాన మాత్రం అలకతో కూడిన కోపం

తరవాత ఒకరోజు దూరమయాను అమ్మకి

సీతాకోకచిలుకలూ పువ్వులూ, దీపం వత్తీ

వాటన్నిటి బదులూ వచ్చాడు ఒక జీవిత భాగస్వామి

అతనిలోనే వెతుక్కున్నాను అమ్మని,పుట్టింటిని

దేవుణ్ణీ మతాన్నీ , కలలనీ మమతనీ

నెమ్మది నెమ్మదిగా కలలు ఒకటొకటిగా

కరిగిపోయాయి,రాలిపోయాయి,భగ్నమయాయి

అమ్మ ఇంటి ఆవరణా,అమ్మ నీడా అన్నీ దూరమయాయి

చివరి కల భగ్నమయినప్పుడు

నా నోటివెంట నిట్టూర్పులా వచ్చింది-అబ్బా , లీవ్ మి అలోన్

అనే మాట.

అనుకున్నాను అమ్మలా నన్ను బుజ్జగిస్తాడనీ అలక తీరుస్తాడనీ

నాకిష్టమైన మిఠాయి కొని తెస్తాడనీ

తన చిరునవ్వుని నా మొహం మీద అలమ్కరిస్తాడనీ

కానీ అతను సూట్ కేస్ లో బట్తలు పడేసుకుని

తన మొండిపట్టుని వెంటపెట్టుకుని

వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి

నాకు తెలీలేదు

సన్నని జ్వాల లాటి

ఆ అమాయకపు ఆ చిన్న వాక్యం

అమ్మతో ఒకప్పుడు అన్న ఆ మాటలు

ఈనాడు ఇలా ఇంత పరాయిదాన్ని చేస్తున్నాయని.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.