ప్రమద

బి. టిఫనీ

-సి.వి.సురేష్ 

ఆఫ్రికన్ అమెరికా రచయత్రి  tiffany బి. రాసిన “the distance love”  కవిత లో ఎంత స్వల్ప మాటలతో,ఎంత గాడత ను వ్యక్త పరిచారో చదివి ఆశ్చర్య పోయాను. ఈ కవిత ను తెలుగు లోకి అనువదించాల్సిన అవసరం ఉందని  భావించాను. ఈ కవిత లో అభివ్యక్తి, ఆ శైలి మనం గమనించాల్సిన అంశం. ఆంగ్లం నుండి, తెలుగు లోకి అనుసృజన చేయడానికి సిద్దపడి, “సుదూర ప్రేమ” ను కవిత  ప్రియులకు అందిస్తున్నాను. 

 

Tiffany.B ||  the distance love ||

తెలుగు లోకి  అనుసృజన :  

సి.వి.సురేష్  || సుదూర ప్రేమ ||

 

చాల కాలంగా 

నా జీవితం శూన్యం గానే ఉంటోంది

అటు ప్రేమించడానికీ ఎవరూ లేరు…

నన్ను నేనుగా కూడా ఆ ప్రేమించుకొనే వీలు లేదు.

అయితే,

చాల  ఓపిగ్గా ..

నా సమయమూ వస్తుందని వేచిఉన్నాను..

ఆ అపురూపమైన అంశాలన్ని 

ఇంకొకరితో పంచుకోవడానికి…

 

..2

అనుకోకుండా, 

నువ్వు ఓ పొగమంచులో నుంచి వచ్చి

నన్ను నన్నుగా  ఒప్పేసుకొని, కలిపేసుకొన్నావు. 

నా లోలోపల  నిండుకొన్న ఖాళీతనాన్ని 

పూర్తిగా  నింపావు…..

నాలోని  ఆ చేదునూ ….

అదే.. అహంకారాన్నుండి నన్ను విముక్తుణ్ణి చేసావు…

 

..3

కరిగి పోని క్షణాలను ఎన్నో 

మనం కలిసే పంచుకొన్నాం…

మన భావనలన్నీ నిజమేనా?  అనికూడా ప్రశ్నించుకొన్నాం 

అలా అనుకొనే లోగానే, 

ఎంత త్వరగా కాలం ఎగిరిపోయిందో !

కాలం ..

నాలోకి ఒక బాగంగా వచ్చిందీ.. వెళ్లి పోయింది..

అయితే,

 “ఇక సెలవ్” అన్న మాటల్ని మాత్రం 

నేను అనేందుకు తిరస్కరించాను.  

 

..4

నేను ప్రేమించిన వారి నుండి…

నేనిప్పుడు వేల మైళ్ళు దూరం ఉన్నాను..

పరిస్థితులన్నీ ఎన్నో  మారాయి, అయితే, 

నేను అలోచించినట్లే

నీవు అప్పటిలాగే ఉంటావని నేను ఇప్పటికీ భావిస్తాను..

ఒక రోజు ఒక ఏడాది గా, 

ఒక నెల ఇక ఎప్పటికి కొలవలేని సమయంగా అనిపిస్తోంది.

మనం గడిపిన క్షణాల గురించి అలోచిస్తూనే…

అదే… ఒక నిధి గా నేను దాచుకొన్నాను.

 

..5

నీ సుకుమెత్తటి ఆ గోధుమ రంగు కళ్ళు 

నన్ను సిగ్గు నుండి దూరం  చేసాయి.

నీ  చిలిపి నవ్వు నా రోజును కాంతివంతం చేసేది

నీ సుకుమారపు స్పర్శలు నాలో చలి తెప్పించేవి.

అనూహ్యమైన నీ మెత్హని శరీరం

నన్నో అతీత ఉద్వేగానికి గురి చేసేది..

 

..6

కానీ,

మనం మన పునః స్పర్శల కోసం

నేను ఓపిగ్గా  వేచి ఉంటాను 

అయితే, ఇప్పుడు నీవల్ల నేను 

గతంలో  కంటే, మరింత  సంతృప్తి గా ఉన్నాను..

ఒక మంచి స్నేహితుడికంటే  ఎక్కువగా,

మళ్ళీ మనం కలిసి ఉండిన ఆ 

మధుర క్షణాలను వెనక్కు తెచ్చుకొంటాను,

ఇదంతా, చివరాఖరకు నీ పెదాలపై  చిరునవ్వు కోసమే..!

ఇతరత్రా విషయాలన్నీ, …

కొద్ది కాలం, యధాతధంగా 

ఉంటాయని విశ్వసిస్తాను.

 

..7

తెలుసా, ఇప్పుడు నీపై నాకున్న తలపులన్నీ 

మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయి.

నీ ప్రేమ,, నేను ఎప్పటికి మరువరానిదై ఉంది. 

చూడు,ఇప్పుడు, నీది అనుకొనేది ఏదో నాలో పెరిగి పెద్దదైంది..

నేనేప్పుడూ, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

అది నాలో అజరామరం…

 

 Distant Love  by Tiffany.B 

 

My life has been so empty for so long, 

no one to love or call my own. 

I patiently waited for that time to come, 

To share this special with someone.

 

..

Until you came from the mist, unexpectedly, 

Taking me as I am and accepting me. 

You filled the emptiness that laid inside, 

releasing me form my bitterness and pride.

..

We shared endless moments together, 

questioning if the feelings were true, 

Not realizing how fast time had flew. 

The time had come for me to part and go away, 

The words goodbye I had refused to say.

..

I am now miles away from the one I love, 

things are so different, but your still all I think of. 

A day seems like year and a month feels like forever, 

I think about the times we spent, and THAT 

I will always treasure

..

Your soft brown eyes that made me shy away, 

your cute little smile that brightened my day. 

Your gentle touch that gave me chills, 

and your whole body in itself that gave 

me thrills.

..

I’ll wait patiently until we can touch again, 

but i am now more satisfied because you 

are more than just my friend. 

To bring back those moments, and to 

finally see your smile, 

And hope that things will remain the same 

for a while.

..

My feelings for you are now stronger than before, 

and your love is something I will not ignore. 

See now, a part of you has grown in me, 

I love you always and forever it will be.

 

Written by Tiffany B.

 

*****

 
Please follow and like us:

4 thoughts on “ప్రమద -బి. టిఫనీ”

  1. చాలా సహజంగా ఉంది అనువాదం.
    ప్రేమ గురించి కవిత్వం వ్రాస్తూనే ప్రేమ కవిత్వానువాదం చేయటంలో సురేశ్ గారు అందెవేసిన చేయి. వారి సాహిత్యాభిలాషకు అభినందనలు

  2. అజారామరమైన ప్రేమ గురించి అద్భుతమైన అనువాదం…ఇదే తెలుగులో కూర్చిన పోయెమ్ అనేలా సహజంగా లలితంగా ఉంది సర్..అభినందనలు…

  3. Lovely కవిత,. కవితనుమించి అనువాదం👌👌👌.నాకు బాగా,నచ్చింది, చిరునవ్వు ను,కోరుకోవడం..Hatsoff😍🙏CVsir!

Leave a Reply

Your email address will not be published.