గజల్

-జ్యోతిర్మయి మళ్ళ 

 

నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం

నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం

 

కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే

మనసులింత ముడిపడితే మసలడమే కష్టం

 

మధువులొలుకు మాటలన్ని  వినుటకైతె ఆనందమే

పరితపించు పెదవులనిక ఓదార్చడమే కష్టం

 

చెంతచేరి నిలుచువరకు లోకమంత నందనమే

ఎంతబాధ దూరమగుట చెప్పడమే కష్టం

 

నీవునేను ఒకరికొకరు తెలియనపుడు ఇద్దరమే

ఇప్పుడైతె విడివిడిగా చూపడమే కష్టం 

 

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.