image_print

 కొత్త అడుగులు-4 (రమాదేవి బాలబోయిన)

 కొత్త అడుగులు-4 ఆత్మగల్ల కవిత్వం – డా|| శిలాలోలిత రమాదేవి బాలబోయిన ఈతరం కవయిత్రి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కవిత్వరంగంలో ఎందరెందరో వెలికివస్తున్న కాలంలో ఎన్నదగిన కవయిత్రి ఈమె. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైనప్పటికీ, ప్రవృత్తిరీత్యా కవయిత్రి. సామాజిక కార్యకర్త. ‘సాంత్వన’ అనే సేవా సంస్థను నడుపుతున్నారు. చాలా మందికి బాసటగా, ఊరటగా నిలబడ్డారు. తనవంతు సాయం అందించడమనేది మనిషిగా తన కర్తవ్యం అని భావించే వ్యక్తి. రాష్ట్ర నలుమూలలలో తననెరిగిన వారందరూ ఆమెను గౌరవించిన తీరులో ఆమె […]

Continue Reading
Posted On :

వీక్షణం- 87

వీక్షణం- 87 -రూపారాణి బుస్సా వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు.  ముందుగా  బలివాడ కాంతారావుగారి కథ “అరచేయి” కథ గురించి చర్చ జరిగింది.  అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని  జ్ఞాపకాలు పంచుకున్నారు.   కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి […]

Continue Reading

సంపాదకీయం-డిసెంబర్, 2019

“నెచ్చెలి”మాట “క్లిష్టాతిక్లిష్టమైనదేది?” -డా|| కె.గీత    అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది? ఆగండాగండి!  ఇదేదో ధర్మసందేహంలా  ఉందా?  అవును, పక్కా గసుంటి సందేహమే!  సరే ప్రశ్నలో కొద్దాం.   ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే   ఆ… తట్టింది.  “కాలిఫోర్నియాలో రోజల్లా కరెంటు పోవడం!”  చాల్లేమ్మా చెప్పొచ్చేవు, వేసవి మొత్తం కరెంటన్నదే ఎరగం మా “సౌభాగ్య వంత”మైన పల్లెటూళ్లో అనుకుంటున్నారా?  కాలిఫోర్నియా లోనే  కాదు అసలు ఇప్పటిరోజుల్లో కరెంటు పోవడమంటే నిత్యజీవితం […]

Continue Reading
Posted On :

ఇదీ నా కవిత్వం(కవిత)

 ఇదీ  నా కవిత్వం – వసుధారాణి   నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది.   కవి అంటే  ఓ వాన చినుకు,  ఓ మబ్బుతునక మండేసూర్యగోళం చల్లని శశికిరణం కన్నీటికెరటం ఉవ్వెత్తు ఉద్వేగం పేదవాడికోపం పిల్లలకేరింత కన్నతల్లి లాలిత్యం గడ్డిపూవు,గంగిగోవు ఒకటేమిటి  కానిదేమిటి కవి అంటే విశ్వరూపం వేయిసూర్య  ప్రభాతం.   గుండెకింద చెమ్మ, కంటిలోన తడి ఇవి లేకుండా  కవిత్వం […]

Continue Reading
Posted On :

కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు

  కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు  -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి   మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే.  ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే […]

Continue Reading
Posted On :

చిత్రం-6

చిత్రం-6 -గణేశ్వరరావు బ్రోర్ద్రిక్ గీసిన ఈ చిత్రం ఒక పోటీలో ప్రధమ బహుమతి పొందింది. బహుమతి ఎంపికకు జ్యూరీ నిర్ణయానికి వున్న కారణాలు ఏవైనప్పటికీ, ఈ చిత్రంలో ఒక విశేషం వుంది: అదే చిత్రంలో మరో చిత్రం. నేపథ్యంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పొలాక్ గీసిన చిత్రం వుంది. బ్రోర్ద్రిక్ చిత్రంలో ఒక విద్యార్థి బృందం చిత్ర కళా ప్రదర్శనలో ఒక కళా కృతిని చూస్తున్నట్టు చూపించబడింది. పొలాక్ ఆమెను ప్రభావింతం చేసాడు, అతను తనకు అందించిన స్ఫూర్తికి  […]

Continue Reading